నూనె మరక పడిందంటే చాలు దుస్తులపై అయినా, గోడలపై అయినా, టైల్స్ పై అయినా వదలడం చాలా కష్టం. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఆ మరకలు ఇట్టే మాయమైపోతాయి.
దుస్తులు, టైల్స్ పై పడిన నూనె మరకలు తొలగించడం కొంతలో కొంత సులభమే కానీ పెయింట్ చేసిన గోడలపై నూనె పడితే అది తొలగించడం కష్టమైన పనే. ఈ మరకలపై పెయింట్ వేసినా కానీ అది పూర్తిగా తొలగిపోదు. మరీ ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ స్టౌ వెనుక ఆయిల్ మరకలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వంట చేసేటప్పుడు నూనె చిమ్ముతూనే ఉంటుంది. వాటిని తొలగించాలంటే తలప్రాణం తోకకు వస్తుంది.
కొన్నిసార్లు గోడల రంగుకూడా ఊడిపోతుంది. ఆ మరకలు ఎలా తొలగించాలంటే..
వెనిగర్
వంటలో ఉపయోగించే వెనిగర్ నూనె మరకలను తొలగించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. వెనిగర్ సాయంతో ఎలాంటి జిడ్డునైనా వదిలేయించవచ్చు. చెడు వాసన, గ్రీజు లాంటి మొండిమరకలు వదలగొట్టడంలో వెనిగన్ చాలా సహాయపడుతుంది. వెనిగర్ ని నీటితో మిక్స్ చేసి దీనిలో స్పాంజ్ కానీ వస్త్రం కానీ ముంచి ఆ మరకపై పూయాలి. దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరిన తర్వాత శుభ్రమైన తడివస్త్రంతో తుడవాలి.
హెయిర్ డ్రైయర్
గోడపై నూనె మరకలు మరీ ఎక్కువగా ఉంటే దానిపై ఓ పేపర్ పెట్టి హెయిర్ డ్రైయర్ తో హీట్ చేస్తే ఆ నూనె కరిగి మీరు గోడకు పెట్టిన పేపర్ కు అంటుకుంటుంది. ఆ తర్వాత వెనిగర్ అప్లై చేస్తే పూర్తిగా జిడ్డు వదిలేస్తుంది.
బేకింగ్ సోడా
గోడపై ఉన్న నూనె మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా మంచి ఫలితం ఉంటుంది. బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్‌లా తయారు చేసి మరక ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఓ పావుగంట ఆరిన తర్వాత క్లాత్ తో అక్కడ తుడవడం ద్వారా నూనె మరక మాయం అవుతుంది.
లిక్విడ్ డిష్ వాషర్..
మీరు గొడ నుంచి నూనె మరకను తొలగించడానికి చవకైన మార్గం కోసం చూస్తున్నట్లయితే, లిక్విడ్ డిష్ వాష్ ఒక గొప్ప ఎంపిక. లిక్విడ్ డిష్ వాష్‌ను మరకపై నేరుగా పూసి ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేస్తే నూనె మరకలు తొలగిపోతాయి.
ఉప్పు
ఉప్పు కూడా వంటలో రుచిగా వండటానికి మాత్రమే కాదు. వంటగది మెరుపుని తిరిగి తెస్తుంది. నూనె మరకలను తొలగించడానికి దానిపై ఉప్పు చల్లుకోండి ఉప్పు నూనె మరకలను గ్రహిస్తుంది తర్వాత అక్కడ వెనిగర్‌ను స్ప్రెడ్ చేసి శుభ్రమైన గుడ్డతో తుడవండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం