ఉచిత హామీలు – కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్ అడ్డదారులు

ఎన్నికల్లొస్తే పార్టీలు రెచ్చిపోతున్నాయి. ఉచిత పథకాలను ప్రకటిస్తూ ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్ని ఉచిత పథకాలను ప్రకటిస్తే విజయం అంత చేరువుగా ఉంటుందని పార్టీలు విశ్వవిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అధోగతిపాలవుతుందని తెలిసి కూడా ఉచితాలు ప్రకటించేందుకు పార్టీలు వెనుకాడటం లేదు. ఓటు బ్యాంకులను పదిలం చేసుకునేందుకు అదొక్కటే మార్గమని నేతలు భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా అదే జరిగింది. ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ తాయిలాలు విసిరింది. త్రిముఖ పోటీలో గట్టేందుకు ఎత్తుగడలు వేసింది..

కన్నడ ప్రజలకు నాలుగు ఉచితాలు

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాలుగు ఉచిత పథకాలను ప్రతిపాదించింది. అధికారానికి వచ్చిన వెంటనే రేషన్ షాపుల్లో ప్రతీ నెల పది కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.అన్న భాగ్య యోజన పేరులో ఆహార ధాన్యాలు అందిస్తారు. గృహజ్యోతి పథకం కింద ప్రతీ ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తామని చెప్పింది. గృహ లక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెల రెండు వేల రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ అంటోంది. యువ నిధి పేరుతో నిరుద్యోగ యువతకు ప్రతి నెల భృతి అందిస్తారు. డిప్లొమా చదివిన వారికి రూ. 1,500 … డిగ్రీ చదివిన వారికి రూ. 3,000 ఇస్తామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. ప్రతీ ఒక్కరిని రెండేళ్ల పాటు ఈ యువ నిధి అందుతుంది. తర్వాతి కాలంలో ఆ పథకాన్ని సమీక్షించి తాజా నిర్ణయం తీసుకుంటారు.. ఇవే కాకుండా రైతు రుణమాఫీ లాంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చుతారు..

రూ. 5 లక్షల కోట్లకు పైగా అప్పు…

కర్ణాటక రాష్ట్రం కూడా అప్పుల్లో మునిగి ఉంది. ఆ రాష్ట్రం అప్పు రూ. 5.2 లక్షల కోటు. ఇది ఎవరో చెప్పినది కాదు. కాగ్ నివేదిక నిగ్గు తేల్చిన అంశం. ప్రతీ నెల ప్రభుత్వం వడ్డీ కింద రూ. 14,178 కోట్లు చెల్లిస్తోంది. వడ్డీ చెల్లింపు అనేది అనుద్పాదక వ్యయమని మరిచిపోకూడదు. 2022.23లో ద్రవ్య నిర్వహణ సమీక్ష జరిగినప్పుడు వడ్డీల కారణంగా అప్పులు మరింతగా పెరిగిపోతున్నాయని ఆర్థిక కమిటీ తేల్చింది. పథకాల హేతుబద్ధీకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కమిటీ సూచించింది.

వ్యయం తడిసి మోపెడు..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉచితాల అమలు చేస్తే ప్రతీ పథకానికి వేల కోట్లు అదనపు ఖర్చు అవుతోంది. గృహ లక్ష్మీ పథకం కింద మహిళలకు రూ.2 వేలు ఇచ్చిన పక్షంలో ఖజానాపై ఏడాదికి రూ. 45 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. ఉచిత విద్యుత్ వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.9,000 కోట్లు వ్యయం తప్పదు. ఇప్పటికే విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 21 వేల కోట్ల అదనపు సాయం అందిస్తోంది. ఇవి కాకుండా రుణ మాఫీ చేస్తే ఏకంగా రాష్ట్ర ఖజానాపై రూ. 60 వేల కోట్ల భారం పడుతుంది.

ఏపీలో పరిస్థితి చూశాం కదా..

ఉచితాలు, సంక్షేమ పథకాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్తిక రంగం కుదేలైన సంగతి దేశం మొత్తం కోడై కూస్తున్నా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అదే తప్పు చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పథకాలకు డబ్బుల్లేక నిధుల కోసం జగన్ సర్కారు అడ్డదారులు తొక్కుతోంది. ఈ చెత్తో డబ్బులిచ్చి, ఆ చేత్తో తీసుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ అప్పులు పది లక్షల కోట్ల రూపాయలు దాటిన నేపథ్యంలో కొత్త అప్పులు పుట్టడం గగనమైపోయింది. రిజర్వ్ బ్యాంక్ కూడా విసుగుచెంది ఏపీపై శీతకన్నేసింది. జీతాలు, పెన్షన్లు దశలవారీగా 15వ తేదీ వరకు జమ చేస్తూనే ఉన్నారు.

ఇక ఫ్రీ కరెంట్ ఇచ్చే ఢిల్లీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. కేజ్రీవాల్ ప్రభుత్వం అతి కష్టం మీద నెట్టుకొస్తోంది. రేపు కర్ణాటకలో ఉచితాల అమలు జరిగితే ఆ రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా దయనీయంగా ఉంటుంది. జీతాలివ్వలేని దుస్థితి