నాలుగేళ్ల వైసీపీ పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పురందేశ్వరి లేవనెత్తిన అంశాలపై తితిదే ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి 24 గంటల్లో శ్వేత్రపత్రం విడుదల చేస్తామని చెప్పినా 48 గంటలైనా ఆ పనిచేయలేకపోయారు. సమాధానం లేదని పారిపోయారా? అని ప్రశ్నించారు.
నాలుగేళ్ల వైఎస్ఆర్‌సీపీ పాలనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైన తొమ్మిది అంశలపై బీజేపీ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
1). బాలల అక్రమ రవాణా విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ 3 వ స్ధానంలో ఉంది. ఈ వైఫల్యానికి మీ సమాధానం ఏంటి?
2). తలసరి ఆదాయంలో దక్షిణాధిరాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనుకబడిరది. వ్యవసాయం, ఆక్వా, ఉద్యానరంగం ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఎందుకు తలసరి ఆదాయం పెరగలేదు ?
3). జలజీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు వినియోగించుకోలేదు? ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్రం ఇచ్చే ఆర్ధిక సహయాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఎందుకు ప్రజలకు మంచినీటిని అందించలేకపోయారు?
4). కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన 25 లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోయారు? ఇళ్ల స్థలాల్లో వచ్చే కమిషన్ కోసం 30 లక్షల ఇళ్ల స్థలాలను సేకరించారు. ఇళ్లు నిర్మిస్తే కమిషన్ కాదు కాబట్టి ఆ పనిచేయలేదా?
5). రాష్ట్రంలో పేదలకు అందించే వైద్య సదుపాయాల విషయంలో ఎందుకు విఫలమయ్యారు? పట్టణ, గ్రామీణ వైద్య, ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, జనరల్ ఆసుపత్రుల్లో ఎందుకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు ? వైద్య పరీక్షలు అందుబాటులో లేవు? మందులు ఎందుకు ఇవ్వడం లేదు? వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు?
6). ప్యానల్‌లో ఉన్న 80 శాతం కార్పొరేట్ ఆసుపత్రులు ఎందుకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయడం లేదు? వారికి బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు?
7). ఉన్నత విద్యను ఎందుకు నిర్ల్యక్షం చేశారు? పీజీ విద్యార్థులకు ఎందుకు ఉపకారవేతనాలు దూరం చేశారు. డిగ్రీలో తెలుగును రద్దుచేశారు. ఆంగ్లభాషకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
8). ప్రభుత్వోద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు? వర్శిటీల్లో ఉపన్యాసకులు, కళాశాలల్లో లెక్చరర్లను, పాఠశాలల్లో టీచర్లను ఎందుకు భర్తీచేయలేదు? ఖాళీగా ఉన్న 2.50 లక్షల బాక్‌లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు?
9). రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను ఉందుకు పునర్నిర్మించలేదు?
పురందేశ్వరిని విమర్శిస్తున్న మంత్రులు చేసిన అభివృద్ధి ఏమిటి ?
తిరుపతిలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ద్రోహంపై, గుంటూరులో అమరావతి రైతులకు చేసిన అన్యాయంపై, పంచాయతీ నిధుల మళ్లింపుపై, రైతులకు రాయితీలు ఇవ్వకపోవడంపై, రాజమండ్రిలో అక్వా ఉత్పత్తుతులకు సహకారం ఇవ్వకపోవడం, విశాఖలో భూకబ్జాలు, దిగజారిన శాంతిభద్రతలు, పారిశ్రామిక అభివృద్ధిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారన్నారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మంత్రులు వ్యక్తిగతంగా విమర్శలకు దిగడం దారుణమన్నారు. పురందేశ్వరిని విమర్శిస్తున్న మంత్రులు ముందుగా తమ శాఖలకు ఎలాంటి న్యాయం చేశారో చెప్పాలని చేశారు. ఏ ఒక్క మంత్రి కూడా చిన్నపాటి అభివృద్ధి చేయలేదన్నారు. రోజా పర్యాటక శాఖకు ఏం చేశారో చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేశారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇంచార్జ గా ఉండి కుటుంబసభ్యులు భూములు దోచుకోవడానికి.. తమ పార్టీ నేతల దందాల కోసం సహకరించారు తప్ప చిన్న అభివృద్ధి పని కూడా చేయలేదని మండిపడ్డారు.
ఏ ఒక్క మంత్రి అయినా తన శాఖ గురించి ఆలోచిస్తున్నారా ?
తన శాఖపై తప్ప.. అన్ని శాఖల గురిచం ిమాట్లాడే గుడివాడ అమర్నాధ్ ఎన్ని కొత్త పరిశ్రమలు తెచ్చారో చెప్పాలన్నారు. ఎంత మందికి ఉపాధి కల్పించారు? కోళ్ల గురించి ఎక్కువ అవగాహన ఉన్న అమర్నాధ్ కోళ్ల పరిశ్రమ పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. బోత్స సత్యనారాయణ ఎంత మంది పీజీ విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చారు? 4 ఏళ్లలో డిఎస్‌సి ద్వారా ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలన్నారు. హౌసింగ్‌లో 1000 కోట్ల నిధులు దుర్వినియోగంపై ఏం సమాధానం చెబుతారు? విడదల రజని వైద్యఆరోగ్య వ్యవస్థను ఎంతగా బలోపేతం చేశారో చెప్పాలన్నారు. కేంద్రం ప్రజల ఆరోగ్య ప్రదాయినిగా ఎయిమ్స్ ఇస్తే.. ఆస్పత్రికి కనీసం నీటిని అందించలేకపోయారని మండిడ్డారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఏటా ఇచ్చే రూ.400 కోట్ల నిధులతో ఒక్కో మనిషికి రూ.5 లక్షల విలువైన వద్య సదుపాయం లభిస్తుంటే ఎందుకు దాని గురించి మాట్లాడని ప్రశ్నించారు. ~వైద్యకేంద్రాలు, పంచాయతీ భవనాలు, స్కూలు భవనాలు, ఆర్‌బీహెచ్‌లు, రహదారులు, పర్యాటక కేంద్రాలకు కేంద్రం ఇచ్చే నిధులతో తప్ప రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని స్పష్టం చేశారు.
బహిరంగ చర్చకు సిద్ధం
బీజేపీ అడుగుతున్న ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని.. 9 మంది లేదా 90 మందిని లేదా కట్ట కట్టుకుని వచ్చినా సరే బహిరంగచర్చకు సిద్ధమని విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేశారు. ఎక్కడికి వస్తారో చెప్పండి. ఎప్పుడైనా చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. సమాధానం చెప్పకుంటే ప్రజాక్షత్రంలో తేల్చుకుంటాం. దిగుజారుడు వ్యాఖ్యలు మానేయాలి. మీ భాషను ప్రజలు ఛీ కొడుతున్నారని స్పష్టం చేశారు. 2024 లో భాజాపా బలమైన రాజకీయ శక్తిగా వస్తుందన్నారు.