జూలై ఆఖరివారం నుంచి ఆగస్టు ఆఖరివారం వరకూ మెగా ఫ్యాన్స్ కి పూనకాలే. ఒకటి కాదు రెండు కాదు మెగా హీరోలవి నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ తో పాటూ వరుణ్, వైష్ణవ్ మూవీస్ కూడా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమంగా ఉన్నాయి. అన్నీ వారం పది రోజుల గ్యాప్ లోనే వచ్చేస్తున్నాయ్.
జూలై 28న ‘బ్రో’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌లు మొదటిసారి కలసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 28న విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై మొదట్నుంచీ ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.
ఆగస్టు 11 ‘భోళా శంకర్’
మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్లో వస్తోన్న మూవీ భోళా శంకర్ . అజిత్ హీరోగా వచ్చిన వేదాళం రీమేక్ గా తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ మూవీ ఆగస్టు 11న విడుదలకానుంది. మెహర్ రమేష్ కి ఇప్పటి వరకూ ఒక్క హిట్టూలేకపోవడంతో ఈ మూవీతో ఫ్లాపుల రికార్డును బ్రేక్ చేయాలని ఆశపడుతున్నారు మెగా అభిమానులు.
ఆగస్టు 18న ‘ఆదికేశవ’
మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమాతో యాక్షన్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఆదికేశవ మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ లక్కీ గాళ్ గా మారిన శ్రీలీల ఇందులో హీరోయిన్.
ఆగస్టు 26 ‘గాండీవధారి అర్జున’
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తోన్న గాండీవదారి అర్జున సినిమా ఆగష్టు 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఓ స్పై అధికారిగా కనిపించనున్నాడు. ‘గని’, ‘ఎఫ్ 3’ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో వరుణ్ ఆశన్నీ గాండీవధారిపైనే పెట్టుకున్నాడు.
మొత్తానికి నెల రోజుల వ్యవధిలో మెగా ఫ్యామీలీ హీరోలవి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏ మూవీ ఏమేరకు మెప్పిస్తుందో , కమర్షియల్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.