పిల్లల్లో బ్రెయిన్ ఎదుగుదలకు ఇవ్వాల్సిన ఆహారం ఇదే!

మూడు పూటలా కడుపునిండా తింటున్నారు, ఆడుకుంటున్నారని అనుకుంటే సరిపోదు..మీరు పెట్టిన ఆహారం వారి ఎదుగుదలకు ఎంతవరకూ ఉపయోగపడుతోందో తెలుసుకోవాలి. శారీరకంగా బరువు పెరుగడం కాదు..మెదడు ఎదుగుదల బావుందో లేదో తెలుసుకోవాలి. మెదడు ఎదుగుదలకు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలుసుకోవాలి. ఎందుకంటే మెదడు ఎదుగుదల మనం మన పిల్లలకు ఇచ్చే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది.

పిల్లలలో మెదడు ఎదుగుదలకు విటమిన్ బి 1, విటమిన్ బి 2 , విటమిన్ బి 3 , విటమిన్ బి 5 , విటమిన్ బి 6 ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

విటమిన్ బి 1 పిస్తా పప్పులు, జీడిపప్పులు, బఠాణీలు, గుమ్మడికాయలు, బీన్స్, సన్ ఫ్లవర్ విత్తనాలు, చియా విత్తనాలు, గుమ్మడి గింజలు, బ్రెడ్, ఆకుకూరలలో ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వలన మెదడులోని కణజాలాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ ను శక్తిగా వంతం గా మారుస్తుంది.

విటమిన్ బి 2 మెదడులోని ఎంజైము ప్రతిచర్యలు సులువుగా అయ్యేలా చేస్తుంది. విటమిన్ బి 2 ఎక్కువగా పాలు, పెరుగు, జున్ను ఇంకా పాల సంబంధిత పదార్థాలలో లభిస్తుంది.

విటమిన్ బి 3 మెదడులో ఉండే కొవ్వును శక్తిగా మార్చే ఎంజైములను విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి 3 ఎక్కువగా సాల్మన్ చేపలు, బీన్స్, మజ్జిగ, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుడ్డు, ఆకుకూరలు వంటి పదార్థాలలో లభిస్తుంది.

విటమిన్ బి 5 మెదడులోని కొవ్వును శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. విటమిన్ బి 5 ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు, గుడ్డు, చికెన్, తేనె, పుట్టగొడుగులు వంటి వాటిలో ఉంటాయి.

విటమిన్ బి 6 మెదడు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. విటమిన్ బి 6 ఎక్కువగా కూరగాయలు, అరటిపండ్లు, బ్రౌన్ రైస్, బంగాళాదుంపలు, ఓట్స్, గుడ్డు వంటి వాటిలో లభిస్తుంది.

చదువుతో పాటూ ఆటలూ ముఖ్యమే!
పిల్లలు ప్రతి పనిలో చురుగ్గా పాల్గొంటూ మంచి తెలివితేటలు కనబరచాలంటే వారిని చదువుకు మాత్రమే పరిమితం చేయకూడదు. ఆటల్లో కూడా పాల్గొనేలా చేయాలి. ఆటలు అంటే మొబైల్స్​లో కాదు. బయటకు వెళ్లి ఫ్రెండ్స్ తో ఆడుకోమని ప్రోత్సహించాలి. వీటితో పాటు సరైన ఆహారం వారికి అందించాల్సి బాధ్యత తల్లిదండ్రులదే. మంచి ఆహారం తీసుకున్నప్పుడే వారికి బ్రెయిన్ బూస్ట్​ అయ్యే అవకాశముంది. కొన్ని ఆహారాలను వారి డైట్​లో కచ్చితంగా చేర్చాల్సిందే అంటున్నారు నిపుణులు.

గుడ్లు
పాలు తర్వాత గుడ్లు అత్యంత శక్తివంతమైన ఆహారంగా పరిగణిస్తారు. ప్రొటీన్‌తో కూడిన గుడ్లను తినిపించడం వల్ల పిల్లలకు మంచి తెలివితేటలు వస్తాయి. కాబట్టి వారికి రోజుకో ఉడకబెట్టిన గుడ్డు తినిపించండి.

ఆకుకూరలు
పిల్లలు ఆకుకూరలు తినమని మారాం చేసినా, ఇష్టం లేదని మొండికేసిన బలవంతం గా అయినా పిల్లలకు అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే .ఆకుకూరలు నేరుగా తినడానికి ఇష్టం లేని పిల్లలకు వేరే మార్గం ద్వారా ట్రై చేయాలి. బ్రోకలీ, పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలను పిల్లలకు తినిపించాలి. ఆకుకూరల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైనది.

డ్రైఫ్రూట్స్
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి డ్రైఫ్రూట్స్‌ను మీ పిల్లలకు రోజూ తినిపించండి. ​వెజిటేరియన్స్ అయితే పిల్లలకు డ్రైఫ్రూట్స్ తప్పకుండా ఇవ్వాలి.

ఓట్స్
ఓట్స్ బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. మెదడును సక్రమంగా ఉంచటానికి , మెదడు ఎదుగు దలలో కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. పిల్లలకు ఇష్టమైన ఎన్నో వస్తువులను ఓట్స్‌లో మిక్స్ చేసి పిల్లలకు తినిపించవచ్చు.

బెర్రీలు
పిల్లలకు బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, ఫ్రూట్ జామ్స్ వంటి వాటిని కూడా ఇవ్వాలి. ఇది పిల్లల మేధస్సును చురుగ్గా ఉంచుతుంది. పిల్లల కంటి చూపు కూడా మెరుగ్గా ఉండేలా సహకరిస్తుంది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…