మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఇవి ఫాలో అవండి

శారీర‌క ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డంలో మాన‌సిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. డ్రిపెష‌న్, ఆందోళ‌న వంటి మాన‌సిక అనారోగ్యాలు దీర్ఘ‌కాలిక వ్యాధులకు దారితీస్తాయి. ఫలితంగా శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గే అవ‌కాశం కూడా ఉంది. ఈ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే కొన్ని ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అడ్రినాలిన్‌, కార్టిసోల్‌ హార్మోన్లు మన శరీరంలో విడుదలవ్వటం వల్ల ఈ ఒత్తిడి వస్తుంది. ఒత్తిడిలో చాలా రకాలున్నాయి.

  1. పర్యావరణ ఒత్తిడి
    మన చుట్టూ ఉండే వాతావరణం, శబ్దాలు, కాలుష్యం, ఉష్ణోగ్రత్తల వల్ల ఇది కలుగుతుంది

2.వ్యక్తిగత ఒత్తిడి
ఒక వ్యక్తికి ఆర్థిక సమస్యలు వెంటాడటం, ఇంటి సమస్యలు, కొత్త నగరానికి వెళ్లటం, కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఇలాంటి ఒత్తిడి ఎదుర్కొంటారు

3.పనికి సంబంధించిన ఒత్తిడి
కార్యాలయంలో ఏర్పరుచుకునే లక్ష్యాలు, పని ఒత్తిడి, డెడ్‌లైన్స్‌, సహోద్యోగులతో గొడవలు లాంటి వాటివల్ల వస్తుంది

4.ఆరోగ్యపరమైన ఒత్తిడి
దీర్ఘకాలిక సమస్యలు ఉండటం, నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలు, వైకల్యం, మానసిక సమస్యలవల్ల ఆరోగ్యపరమైన ఒత్తిడి కలుగుతుంది

ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు
1.ధ్యానం
ఒత్తిడిని నివారించడానికి ప్రతిరోజూ 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం చేయాలి. ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. క్రమం తప్పకుండా చేయడం వల్ల మీరు ఒత్తిడి నుంచి బయటపడుతారు. అంతేకాదు ఆందోళన స్థాయి తగ్గుతుంది.ప్రాణాయామం చేయడం ద్వారా రిలాక్స్‌ అవుతారు. మీ జీవక్రియ రేటు కూడా బాగా మెరుగుపడుతుంది.

2.రాయాలి
డైరీ రాయడం ముఖ్యంగా… మీ అనుభవాలు, భయాలు, ఆలోచనల గురించి ప్రతిరోజూ ఒక బుక్‌లో రాయండి. ఈ థెరపీ మీ మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల మీరు వదిలిపెట్టిన పనులు, భవిష్యత్‌లో చేయాల్సిన పనులు అన్ని గుర్తుకువస్తాయి. తద్వారా మంచి రిలీఫ్ ఉంటుంది.

3.తగినంత నిద్ర
రోజూ సమయానికి నిద్రపోవాలి. నిద్రించడానికి 3 నుంచి 4 గంటల ముందు మొబైల్, ఐఫోన్, టీవీని ఉపయోగించడం మానేయండి. కచ్చితంగా ఒత్తిడి నుంచి బయటపడతారు.

  1. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి
    ఒత్తిడి తగ్గించే సరైన ఔషధం చిన్నారులు. ఇంట్లో చిన్న పిల్లలుంటే వారితో ఆడుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది

సరైన పోషకాలుండే ఆహారం, కంటినిండా నిద్ర ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా సంతోషంగా ఉండటం, నలుగురి మధ్యా ఉండడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. రోజును సరిగ్గా ప్లాన్ చేసుకుని దానిప్రకారం ఫాలో అవుతూ వెళితే ఒత్తిడి దరిచేరదు. యోగా, మెడిటేషన్‌ లాంటివి చేస్తూ..నిపుణుల సలహాలు తీసుకోవడం కూడా మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…