అమిత్ షా , జేపీ నడ్డా సభలతో ఏపీ బీజేపీలో ఉత్సాహం – విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు … ఇద్దరు అగ్రనేతలు అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమల్లో రోజుమార్చి రోజు సభలు నిర్వహించనుండటంతో బీజేపీలో జోష్ కనిపిస్తోంది. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఏపీలో పర్యటించబోతున్నారు. అమిత్ షా ఏపీలోని విశాఖలో ఎనిమిదో తేదీన బహిరంగసభకు హాజరవ్వాల్సి ఉంది. కారణం ఏదైనా మూడు రోజులుకు వాయిదాపడింది . తిరుపతిలో పదో తేదీన జేపీ నడ్డా పదో తేదీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతల బహిరంగసభలపై ఈ సారి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

బీజేపీతో పొత్తు కోసం పోటీ పడుతున్న ప్రాంతీయ పార్టీలు

ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు బీజేపీ హైకమాండ్ వద్దకు పదే పదే వెళ్తున్నారు. తమపై చల్లని చూపు కొనసాగించాలని జగన్ అదే పనిగా బీజేపీ పెద్దల్ని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల్ని కలుస్తున్నారు. ఆయనకూ బీజేపీతో కలవాలన్న ఉద్దేశం లేకపోతే ఎందుకు వెళ్తారని చెబుతున్నారు. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం ఈ రెండు పార్టీల విషయంలో ఎలాంటి సంకేతాలను రాష్ట్ర నేతలకు పంపలేదు. పొత్తులు ఉంటాయని చెప్పలేదు. దీంతో ప్రాంతీయ పార్టీల నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని… రాష్ట్ర నేతలకు అర్థమైపోయింది. అందుకే రెండు బహిరంగసభల్ని భారీ ఎత్తున సక్సెస్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

పొత్తుల గురించి ఆలోచించకుండా ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ నేతలు

జనసేన నేతలు పొత్తుల గురించి ఆలోచించడం లేదు. కేంద్ర పెద్దలు ఇచ్చిన టాస్కుల్ని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు. ప్రధాని మోదీ పాలనా విజయాలను ప్రస్తుతం ముఫ్పై రోజుల పాటు ఇంటింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బహిరంగసభలు కూడా అందుకే పెడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా… ఏపీ బీజేపీ నేతలు… పార్టీని ఏపీలో బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. పొత్తులు ఉంటే వచ్చే సీట్ల కన్నా… పార్టీ మొత్తాన్ని త్యాగం చేయాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. జనసేనతో పొత్తు చాలని వారనుకుంటున్నారు.

బహిరంగసభల్లో క్లారిటీ

ఏపీలో ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లాలా అన్నది బీజేపీ నేతలకు అమిత్ షా, నడ్డాలు ఈ మేరకు వారికి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు పార్టీలకు సమదూరం అని.. ఏపీలో జనసేనతో కలిసి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని వారు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సారి ప్రాంతీయపార్టీలు వేసే ట్రాప్‌లో బీజేపీ పడకపోవచ్చన్న అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.