ఎన్నికల దృష్టితో అన్నీ చూడకూడదు – బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి

ఏపీలో బీజేపీ వైసీపీ పార్టీల మధ్య మాటల దాడి తారస్థాయికి చేరుకుంటోంది. ఈ నెల 13వ తేదీన జరగనున్న శాసనమండలి ఎన్నికలలో కూడా ఓటర్లను కోనుగోలు చేసే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరం అన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన రెడ్డి. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం ఈ అంశం పై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈనెల 13న ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఏపీలో వైజాగ్ లో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుని ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని నిర్వహించారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన పెట్టబడుల సదస్సుపై విమర్శలు చేసిన వైసీపీ ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడులపై పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పెట్టుబడులకు సంబంధించి శ్వేత పత్రాన్ని విడుదల చెయ్యాలన్నారు. జనసేన, బిజేపి మధ్య పొత్తు కొనసాగుతుంది. కొన్ని పార్టీలు మాత్రం విడిపోవాలని కోరుకుంటున్నాయన్నారు వారి కోర్కెలు తీరవన్నారు.