భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అద్భుతమైన విజయాల్ని సాధించింది. అందులో సందేహం లేదు. చంద్రుడ్ని గురిపెట్టినప్పుడు… పెద్ద ఎత్తున కేంద్రం నిధుల్ని సమకూరుస్తున్నప్పుడు… ఆ ప్రయోగంంలో ఉండే వారిపై వచ్చే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ప్రయోగం ఫెయిలతే ఖర్చు పెట్టినదంతా వృధా అయిపోతుందేమోనన్న భయమే కాదు.. భవిష్యత్ ప్రాజెక్టులపై అపనమ్కం ఏర్పడుతుందన్న ఆందోళన కూడా ఉంటుంంది. చంద్రయాన్ 2 చివరి దశలో విఫలం అయినప్పుడు .. అదే బాధ ఇస్రో శాస్త్రవేత్తల్లో కనిపించింది. కానీ నాడు ఒకే ఒక వ్యక్తి ఇచ్చిన మనోధైర్యంతోనే క్షణాల్లో వారంతా తేరుకున్నారు . వ్యక్తి నరేంద్రమోదీ. చంద్రయాన్ త్రీ విజయానికి శాస్త్రవేత్తలకు మనోబలం ఇచ్చిన నాయకుడు.
చంద్రయాన్ – శివన్ – మోదీ
చంద్రయాన్ రెండో ప్రయోగం కూడా సౌత్ పోల్ పై సాఫ్ట్ ల్యాండింగ్ జరగాల్సి ఉంది. కానీ క్రాష్ ల్యాండింగ్ అయింది. అయితే అక్కడి వరకూ ప్రయోగం సక్సెస్ అయింది. కానీ సంపూర్ణం కాలేదు . దీంతో శాస్త్రవేత్తలందరూ నిరాశపడిపోయారు. ఈ ప్రయోగం కోసం ప్రాణం పెట్టిన అప్పటి ఇస్రో డైరక్టర్ శివన్ కన్నీరు పెట్టుకున్నారు. కానీ ప్రయోగాన్ని చూసేందుకు వచ్చిన మోదీ పరిస్థితిని వెంటనే గమనించారు… శివన్ ను హత్తుకుని ఓటమి గెలుపునకు బాసట అని .. ఉత్సాహం ఇచ్చారు. భవిష్యత్ ప్రాజెక్టులపై తదుపరి క్షణం నుంచే దృష్టి పెట్టాలని సూచించారు.
మోదీ మనోధైర్యంతో శాస్త్రవేత్తల రెట్టించిన ఉత్సాహం
సాధారణంగా ప్రయోగం ఫెయిల్ అయితే.. అది ఎక్కడ తమ వైఫల్యమని ప్రజలు అనుకుంటారోనని… దులిపేసుకోవడానికి గతంలో ప్రభుత్వాలు ప్రయత్నించేవి. కానీ మోదీ అలాంటి నాయకుడు కాదు. అందుకే వైఫల్యాన్నీ ఓన్ చేసుకున్నారు. ఎవరూ నిరాశపడకుండా చూశారు. అలాంటి సందర్భంం నుంచి పుట్టుకొచ్చిన చంద్రయాన్ త్రీ ప్రయోగం… అద్భుత ఫలితాలను ఇచ్చింది.
బలమైన నాయకత్వమే విజయాలకు అసలైన పునాది
చివరి కంటా పోరాడి .. ఓడిపోయిన వాడికి.. కాస్తంత బాధ ఉంటుంది కానీ.. తన కష్టం మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని విజయం అంచుల వరకూ చేరుకున్న తన ప్రతిభను చూసి మరింత పెంచుకుంటాడు. భవిష్యత్ లక్ష్యాల కోసం ప్రయత్నిస్తారు. అందు కోసం కావాల్సింది బలమైన నాయకత్వం. అప్పట్లో మోదీ అదే ఇచ్చారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఎలాంటి సమయంలో నైతిక మద్దతు ఉండాలో ఆ సమయంలో మోదీ అండగా ఉన్నారు. చంద్రయాన్ అద్భుతమైన ప్రయోగం. ల్యాండర్ తయారు చేయడానికి కూడా రష్యాకు చేతకాలేదు. కానీ ఇండియా శాస్త్రవేత్తలే స్వయంగా తయారు చేసి చంద్రునిపైకి పంపారు. అనుకున్నది సాధించారు.