Eggs Test Tips: మీరు వండుకునే ఎగ్స్ తాజావో కాదో ఇలా తెలుసుకోవచ్చు

గుడ్డు..ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్..ఏ టైములో అయినా తినేందుకు అనువుగా ఉండే, అందరూ ఇష్టపడే టెస్టీ ఆహారం గుడ్డు. అయితే తినేముందు ఆ గుడ్డు మంచిదేనా,పాడైపోయిందా అన్నది ఎలా తెలుసుకుంటారు. పెద్దపెద్ద సూపర్ మార్కెట్లలో అయితే కొనుగోలు చేసినప్పుడు ఆ ప్యాకెట్ల వెనుక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మరి చికెన్ షాపులు, ఇంటికి దగ్గర్లో ఉండే కిరాణా దుకాణాల్లో కొనుగోలు చేస్తే ఆ గుడ్లు ఎన్నాళ్లవో ఎలా తెలుస్తుంది. వీటి నాణ్యత చెక్ చేయడానికి కొన్ని ప్రాథమిక తనిఖీలు ఉన్నాయి.

గుడ్డుని తినిఖీ ఇలా చేయండి
ఒక గిన్నెలో నిండుగా నీరు తీసుకుని దానిలో గుడ్డును వేయండి
గుడ్డు ఆ గిన్నె అడుగున అడ్డంగా ఉంటే తాజాగా ఉందని అర్థం
గుడ్డు అడుగున నిలువుగా ఉంటే అది నిల్వ ఉన్న గుడ్డు అని అర్థం
గుడ్డు గిన్నెలో పైన తేలుతూ ఉంటే అది కుళ్ళిపోయిందని అర్థం
రంగుమారినా, పగుళ్లు ఏర్పడినా అవి కుళ్లిపోయాయని అర్థం
గుడ్డు తాజాదనాన్ని తనిఖీ చేయడానికి ఎంతో సులభమైన మార్గం ఇది

బరువు తగ్గాలి అనుకుంటే..
గుడ్డులో కొంత మంది తెల్లసొన తింటారు. కొందరు గుడ్డంతా తినడానికి ఇష్టపడతారు. అయితే బరువు తగ్గాలనుకుంటే మాత్రం తెల్లసొన మాత్రమే తినండి. గుడ్డు మంచి పుష్టికరమైన ఆహారం. అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. వండడం కూడా చాలా తేలిక. అయితే గుడ్డు మీద షెల్ ఉండడం వల్ల లోపలి పదార్థం చెడిపోయిందా బాగుందా అనేది త్వరగా తెలుసుకోలేం. ఈ షెల్.. వాటి షెల్ఫ్ లైప్ ను కూడా పెంచుతుంది. అంత త్వరగా చెడిపోవు. కొద్దిగా ప్రాసెస్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. గుడ్లు ఉత్పత్తి అయిన రోజు నుంచి నాలుగు వారాల వరకు నిల్వ ఉంటాయి. గుడ్డు నిల్వ ఉండేందుకు అనువైన వాతావరణం, అనుకూల పరిస్థితులు ఉండాలి కూడా. ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేస్తే దాదాపు 45 రోజుల వరకు బావుంటాయి. అలా కాకుండా బయట పెట్టినపుడు ఏడు నుంచి పది రోజుల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. ఇంకా అవి బావున్నాయో లేదో తెలుసుకోవాలంటే పైన చెప్పిన టెస్ట్ చేస్తే సరిపోతుంది.

గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే

@ గుడ్లు తీసుకుంటే శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి, గుండెకు మంచిది కాదని వాతం చేస్తుందని లావు పెరిగి పోతారని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. అయితే రోజుకి ఒకటి రెండు గుడ్లు తినడం వల్ల మీకు ఎటువంటి నష్టాలు కూడా దరిచేరవు.

@ వారానికి ఆరు గుడ్లు తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయట. కోడిగుడ్లలో అధికంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయి.

@ శరీరంలో ఉన్న చెడు కొవ్వు తొలిగిపోయి శరీరానికి ఉపయోగపడే మంచి కొవ్వు తయారవుతుంది.

@ గుండె జబ్బులు డ‌యాబెటిస్ ఉన్న‌వారు కోడిగుడ్డులోని ప‌చ్చ‌సొనని తీసి తెల్లసొన మాత్రమే తినాలి. పచ్చసొన మీ గుండె ఆరోగ్యానికి మంచిది కాదు

@ ఫ్రై చేసిన గుడ్లు తినాలా లేక ఉడకబెట్టిన గుడ్లు తినాలా లేదంటే పచ్చి కోడిగుడ్డు తినాలా…అని అంటే…ఎలా తిన్నా కూడా అవి మీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగానే ఉంటాయి.ఎగ్స్ లో శ‌రీరానికి కావ‌ల్సిన లుటీన్‌, కొవ్వులు, ప్రోటీన్లు, లెచితిన్‌, విట‌మిన్లు, జియాజాంతిన్‌, మిన‌ర‌ల్స్ ఉంటాయి.

@ మీ ఎముకలు బలంగా మారాలన్నా, మీ కంటి చూపు బావుండాలన్నా, శరీరం దృఢంగా ఉన్నాలన్నా రోజుకో గుడ్డు తినడం మంచిది. కోడి గుడ్డు లో పొటాషియం క్యాల్షియం ఐరన్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. రక్తహీనత లాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్న వారికి ఇది మంచి మెడిసిన్. దీనిలో ఉండే ఐరన్ మీ రక్తహీనత సమస్య ను తరిమి పారేస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…