ఏపీ బీజేపీ సన్నాహాలపై పొత్తుల ఎఫెక్ట్ – టీడీపీ, జనసేన కావాలనే చేస్తున్నాయా ?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన పొత్తు కూడా కుదుర్చుకున్నాయి. ఈ పొత్తులో తమతో పాటు బీజేపీ కూడా కలుస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ అడుగు ముందుకు పడటం లేదు. తమ ప్రతిపాదనలతో బీజేపీ హైకమాండ్ వద్దకు వెళ్లాల్సిన నేతలు వెళ్లడం లేదు. బీజేపీ ఎన్నికల సన్నాహాలపై ప్రభావం చూపేలా వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఏపీ విషయంలో ఆలస్యంగా కసరత్తు

ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో బీజేపీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. కానీ పొత్తుల పై స్పష్టత రాకపోవడంతో నియోజకవర్గాల వారీగా అభ్యర్థులపై కసరత్తు ఆలస్యంగా ప్రారంభిచాల్సి వచ్చిదంది. ఇటీవలి సమవేశంలో ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు పేర్లు ఖరారు చేశారు. జిల్లాల ముఖ్యనేతలు, ఇన్‌ఛార్జ్‌లతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమావేశం నిర్వహించారు. హైకమాండ్ ప్రతినిధిగా శివప్రకాష్ వచ్చారు. ల పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ చేశారు. ఇప్పటికే ఎన్నికల కోర్ కమిటీ, త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా బీజేపీ జాతీయ నేతలు అభ్యర్థుల వడపోత చేస్తారు.

పొత్తుల కసరత్తుతో ఎన్నికలకు ప్రిపేర్ కాని బీజేపీ

అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. బీజేపీ మాత్రం..ఎలాంటి ప్రిపరేషన్లు చేపట్టలేకపోయింది. ఇంత వరకూ కనీస ప్రచార ప్రణాళిక లేదు. ఒక్క బహిరంగసభ నిర్వహించలేదు. చిన్న చిన్న కార్యక్రమాలు ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. ప్రజాపోరు కార్యక్రమాన్ని మాత్రం ఉద్ధృతంగా నిర్వహిస్తున్నారు. దీనిపైనా పొత్తుల చర్చల ఎఫెక్ట ్పడుతుదంి. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు అన్ని స్థాయాల్లో పోటీ చేయడం కూడా సాధ్యం కాని విషయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

హైకమాండ్ చెప్పేదే ఫైనల్ .. కానీ

రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒంటరి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది? అన్న అంశాలపై హైకమాండ్ పరిశీన చేసింది. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని నేతలు లిఖితపూర్వకంగా ఇచ్చారు. అయితే జనసేన, టీడీపీ ఆడుతున్న గేమ్.. ఆలస్యం కారణంగా బీజేపీకి పాలుపోని పరి స్థితి ఏర్పడుతుంది. వ్యూహాత్మకంగా ఆ రెండు పార్టీలు ఆలస్యం చేస్తున్నాయని.. చివరి క్షణం .. స్వల్పంగా సీట్లు ఇచ్చి సర్తి చెప్పే ఆలోచన చేస్తున్నారన్న అభిప్రాయం.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.