ఉదయాన్నే టిఫిన్ బదులు ఇవి తినండి – అందం, ఆరోగ్యం మీ సొంతం!

అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం చేసే వ్యాయామంతో పాటూ ఆహారం అలవాట్లతో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చాలామంది బరువు తగ్గడంలో భాగంగా బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు..అయితే బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు కానీ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిత్యం మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 5 భాగం చేసుకుంటే అందం, ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు.

ఎగ్స్
ఎగ్స్ లో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆరోగ్యాన్నివ్వడంతో పాటూ స్కిన్ ని మెరిసేలా చేయడంలో సహకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ A, E ఆరోగ్యకరమైన చర్మ కణాలను నిర్వహించడానికి సహాయపడతాయి. మీ అందాన్ని సంరక్షించుకోవడానికి మీ బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు కచ్చితంగా చేర్చుకోండి.

ఓట్మీల్‌
ఓట్స్ కేవలం బరువు తగ్గించడానికే కాదు సౌందర్యాన్ని సంరక్షించడానికీ తోడ్పడతాయి. ఓట్స్‌లోని బీటా – గ్లూకాన్‌లు ఉంటాయి. ఇవి చర్మంలో మెరుపు పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్‌లను దెబ్బతినకుండా కాపాడుతుంది. మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్మీల్‌ చేర్చుకుంటే మీ అందం చెక్కుచెదరదు.

అవకాడో
అవోకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవకాడోలోని మోనోశాచురేటెడ్‌ కొవ్వులు చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, మృదువుగా ఉంచడానికి సహాయపడతాయి. అవకాడోలోని విటమిన్‌ ఇ, సి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి తోడ్పడతాయి. మీ బ్రేక్‌ఫాస్ట్‌లో అవకాడో తీసుకుంటే మృదువైన చర్మం మీ సొంతం

బెర్రీలు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీల్లో విటమిన్‌ సితో సహా.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే నష్టం నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. బెర్రీలలోని పోషకాలు వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తాయి.

యోగర్ట్‌
యోగర్ట్‌ ప్రొటీన్‌, ప్రోబయోటిక్స్‌ అద్భుమైన మూలం. ఇది మీ గట్‌ మైక్రోబయోమ్‌ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సహాయపడుతుంద. చర్మ ఆరోగ్యానికి.. హెల్తీ గట్‌ చాలా అవసరం. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది, సమతుల్య ఛాయను ప్రోత్సహించడానికి తోడ్పడుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.