ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కాలుష్యం, ఆహార అలవాట్లు ఇలా దీనికి చాలా కారణాలున్నాయి.మరీ ముఖ్యంగా వానాకాలంలో జుట్ట ఎక్కువగా ఉడిపోతుంటుంది. అందుకే షాంపులు మారుస్తారు, రకరకాల ప్రయోగాలు చేస్తారు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, జింక్, బి విటమిన్లు, ఐరన్, బయోటిన్, ప్రోటీన్, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలతో సహా సరైన పోషకాలు లేకపోవడం వల్ల జుట్టు విపరీరతంగా రాలుతుందని నిపుణులు చెబుతున్నారు.
బచ్చలికూర
బచ్చలికూరలో ఇనుము, విటమిన్ ఎ, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే పోషకాలు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు బాగా పెరిగేందుకు, జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది.
గుడ్లు
ప్రోటీన్ లోపం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది, జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అలాంటి ప్రోటీన్ గుడ్లలో పుష్కలంగా ఉంటుంది. గుడ్లు లేదా గుడ్డులోని అన్ని అవసరమైన ప్రోటీన్లు, జుట్టును బలోపేతం చేస్తాయి
అవకాడో
అవోకాడో లో ఉన్న అమైనో ఆమ్లాలు , విటమిన్ ఇ వంటివి జుట్టుకు అద్భుతంగా పని చేస్తుంది. ఇది స్ప్లిట్ ఎండ్స్ ని తొలగిస్తుంది మరియు మీ జుట్టు మొత్తం ఆరోగ్యంగా ఉండటంలో కూడా సహాయపడుతుంది.
చిక్కుడు
చిక్కుళ్లు జుట్టును బలోపేతం చేయడానికి, పెరగడానికి కూడా సహాయపడతాయి. కాయధాన్యాలు ప్రోటీన్, ఇనుము, జింక్, బయోటిన్ కు అద్భుతమైన మూలం. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి లు ఉంటాయి.
వాల్ నట్స్
వాల్ నట్స్ లో బయోటిన్, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ ఇ, ప్రోటీన్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ వెంట్రుకల మూలాలను బలపరుస్తాయి.
పెరుగు
పెరుగులో విటమిన్ బి5, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. పెరుగుతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ లు జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడతాయి. పెరుగులో జుట్టుకు సహజంగా పోషణనిచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
గుమ్మడి గింజలు
గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది మరియు ఇది సెల్యులార్ ఉత్పత్తి, కణ విభజన మరియు పెరుగుదలకు కెరాటిన్ అనే ప్రోటీన్ ఏర్పడటానికి సహాయపడుతుంది.
ఓట్స్
ఓట్స్ లో ఫైబర్స్, జింక్, ఐరన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, జుట్టు పెరుగుదలను ప్రేరేపించే పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
సోయాబీన్
సోయాబీన్ చురుకైన జుట్టు పెరుగుదలకు పోషక పదార్ధంగా పనిచేస్తుంది. వంటకాలు, సూప్‌లు, సలాడ్లు మొదలైన వంటకాలలో దీన్ని చేర్చండి.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలలో ఎక్కువ మొత్తంలో సిలికా ఉంటుంది. జుట్టు బలంగా ఉండేందుకు, జుట్టు పెరుగుదలకు సిలికా ఒక ముఖ్యమైన ఖనిజం. వీటిని తింటే మీ బరువు కంట్రోల్ లో ఉండటమే కాదు.. మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.