పోస్టల్ బ్యాలెట్స్ పై ఈసీ క్లారిటీ – ఓట్లు చెల్లవన్న వైసీపీ ప్లాన్ ఫెయిల్

పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువగా చెల్లకుండా చేయాలన్న వైసీపీ ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. ఫామ్ 13ఏ’పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. అలా ఉండి స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఈసీవో మీనా ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ గరం గరం అవుతోంది. అనేక ఫిర్యాదులు చేశారు. చివరికి ఈసీ క్లారిటీ ఇచ్చేసింది.

ఆర్వోల సంతకం పెద్ద విషయం కాదు !

చాలా ఆర్వోలు కుట్ర పూరితంగా సంతకాలు చేయలేదని వారు చేసిన తప్పునకు.. ఓట్లు ఎందుకు ఇన్వాలిడ్ కావాలని టీడీపీ ప్రశ్నిస్తూ.. ఈసీకి లేఖ పెట్టింది. ఈసీ లేఖను పరిశీలించి .. అలాంటి ఓట్లు చెల్లుతాయని.. ఆ కారణంతో తిరస్కరించేది లేదని స్పష్టం చేసింది. అయితే వైసీపీ మాత్రం ఇలా చేయడం తప్పని వాదిస్తోంది. కౌంటింగ్ రూములో ఘర్షణలు జరుగుతాయని పేర్ని నాని లాంటి వాళ్లు హెచ్చరించారు. . లాయర్ కమ్ ఎంపీ నిరంజన్ రెడ్డితో సీఈసీకి ఫిర్యాదు చేయించారు. హైకోర్టుకు కూడా వెళ్లారు.

క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఎన్నిక సంఘం

చివరికి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కూడా క్లారిటీ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ అభ్యంతరాలపై ఈసీ రిప్లై ఇచ్చింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తూ లేఖ పంపింది. పోస్టల్ బ్యాలెట్లను వాలీడ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేిసంది. ఏపీ సీఈవోకు లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.

హైకోర్టులో లంచ్ మోషన్

సీఈసీ అభ్యంతరాలను తోసిపుచ్చినట్లుగా తెలియడంతో వైసీపీ వెంటనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు కూడా లేదని నిపుణులు చెబుతున్నారు. హైకోర్టు విచారణ తరవాత పోస్ట బ్యాలెట్స్ వ్యాలిడేషన్ పై స్పష్టత వస్తుంది.