కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఏడాది డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది జనవరిలో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లొచ్చని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనను ఇతర పార్టీల నేతలు అందిపుచ్చుకున్నారు. నితీష్ కుమార్ కూడా అదే చెబుతున్నారు. దీనికి వారు చెబుతున్న కారణం ఏమిటంటే ప్రచారం కోసం ఇప్పటికే బీజేపీ హెలికాప్టర్లన్నీ బుక్ చేసుకుందట. ఈ కారణం ఎంత సిల్లీగా ఉందో రాజకీయవర్గాలకు సులువుగానే అర్థమవుతుంది. కానీ విపక్ష నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు.
ఐదు రాష్ట్రాలతో పాటు లోక్ శభ ఎన్నికలు జరగాలని విపక్ష కూటమి కోరిక
అక్టోబర్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిపికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మీజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 2024లో జరగాల్సి ఉన్నది.పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం ప్రారంభించారు. బీజేపీని ప్రక్షాళన చేయడం, కేంద్ర మంత్రి వర్గ విస్తరణను చేయనుండటం మాత్రమే ఎన్డీఏను కూడా బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. కొత్త పార్టీలను చేర్చుకుంటున్నారు. అందుకే మందస్తుకు మోదీ కూడా రెడీ అని విపక్షాలు చెబుతున్నాయి. కానీ ముందస్తు అంటే.. ఏడాదో.. రెండేళ్ల ముందే వెళ్తారేమో కానీ.. మూడు నెలల ముందు వెళ్తారా అనే లాజిక్ మాత్రం మర్చిపోతున్నారు.
కాంగ్రెస్ చెబుతోంది.. విపక్షాలు పాటిస్తున్నాయి !
మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ.. బీజేపీతో ముఖాముఖి పోరాడుతోంది. అక్కడ కాంగ్రెస్ ఓడిపోతే … మొత్తానికే మోసం వస్తుంది. రాజస్థాన్ బీజేపీ పరిస్థితి చిందరవందర అయింది. మద్యప్రదేశ్ లో ఆశలు వదిలేసుకుంటున్నారు. చత్తీస ఘడ్ లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది . తెలంగాణలో గట్టిపోటీ ఉంది. కానీ కాంగ్రెస్ గెలుస్తుందని ఎవరూ చెప్పడం లేదు. అందుకే కాంగ్రెస్ ఐదు రాష్ట్రాలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగాలని కోరుకుంటోంది. అదుకే విపక్షాలను ముదు పెట్టి ప్రచరం చేస్తోంది.
ఇండియా కూటమి వచ్చిన్నమైపోతుందేమోనని ఆదోళన
బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను అంచనా వేసుకుని.. సిద్ధాంతాల ప్రాతిపదికగా అందరూ ఒకే వేదికపైకి రావడానికి కొంత సమయం పడుతుంది. పట్నా, బెంగళూరలో సమావేశాలు జరిగాయి. ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి పూర్తి స్థాయిలో సమన్వయం సాధించలేదు. నాయకత్వం వహించడానికి నితీష్ కుమార్ కూడా రెడీగా లేరు. కాస్త ఆలస్యం అయితే మొత్తం కూటమి చిందరవందర అయ్యే అవకాశం ఉంది. అందుకే వారు తొందర పడుతున్నారు
ప్రజలపై భారం తగ్గిస్తే.. ఎన్నికల కోసమనా ?
సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది . నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికడుతోంది. అందుకే ఇప్పటికిప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. గ్యాస్ బండను రెండు వందల వరకూ తగ్గించారు. పెట్రోల్, డీజిల్ ధరలు రేపోమాపో తగ్గించబోతున్నారు. ఇప్పటికే పది లక్షల ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నారు. జీ 20 సదస్సును కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇవన్నీ దేశం కోసం చేస్తున్న పనులే కానీ ఎన్నికల కోసం కాదని బీజేపీ వర్గాలంటున్నాయి.