లివర్ దెబ్బతినకుండా ఉండాలంటే మందుబాబులు ఈ పండు తినాలి!

ఆల్కాహాల్ ఆరోగ్యానికి హానికరం..ఆ విషయం మందుబాటిల్ పైనే ఉంటుంది. కానీ నిత్యం మందుపడనిదే కనుకుపడని మహానుభావులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అలాగని అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడం కూడా సరైంది కాదు కదా..అందుకే ఈ చిన్న జాగ్రత్త తీసుకుంటే ముఖ్యంగా లివర్ పై పడే ప్రభావాన్ని తగ్గించవచ్చంటారు ఆరోగ్య నిపుణులు…

సీజన్ ఏదైనా,రేట్లు పెరిగినా తగ్గినా అస్సలు పట్టించకోని జాబితాలో ఫస్ట్ ఉంటారు మందుబాబులు. ఒక్కసారి అలవాటు పడాలే కానీ అప్పులైనా చేస్తారు కానీ మందుకి మాత్రం దూరంగా ఉండరు. తాగితే పోతారని హెచ్చరికలు ఉన్నా కానీ వాటిని అస్సలు పట్టించుకోరు. అప్పుడప్పుడు అంటే సరే కానీ కొందరు అధిక మోతాదులో తాగుతుంటారు. ఆల్కాహాల్ ను ఏ విధంగా తీసుకున్నా కూడా క్రమంగా కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. కాలేయ క‌ణాలు ఫ్యాటీగా మారిపోతాయి, కాలేయం గ‌ట్టిగా మారిపోతూ ఉంటుంది. అవే క్యాన్స‌ర్ గా మారే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆల్క‌హాల్ తాగిన‌ప్ప‌టికి కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తినకుండా ఉండాలంటే మ‌నం ఒక పండును తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అదే అంజీర్…

కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే పండ్లల్లో అంజీరా పండు కూడా ఒక‌టి.
@ అంజీర్ పండు తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ క‌ణాలు పూర్తిగా శుభ్ర‌ప‌డ‌తాయి. ఆల్కహాల్ తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ క‌ణాల్లోకి చేరిన ర‌సాయ‌నాలు, మ‌లినాలు పూర్తిగా తొల‌గిపోతాయి
@ మార్కెట్ లో అంజీరా పండ్ల‌తో పాటు ఎండిన అంజీరాలు కూడా ల‌భిస్తూ ఉంటాయి. ఆల్క‌హాల్ తీసుకునే వారు నిత్యం 6 నుండి 10 అంజీరా పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆల్కాహాల్ కార‌ణంగా కాలేయ క‌ణాలు దెబ్బ‌తినకుండా ఉంటాయి.
@ అంజీరా పండ్ల‌ల్లో బీటా డి గ్లెకోసిల్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది కాలేయ క‌ణాల్లో ఉండే ర‌సాయనాలను తొల‌గించి కాలేయ క‌ణాలు తిరిగి సాధార‌ణ స్థితికి చేరుకునేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు.
@ అంజీరాలో సినో బ‌యోటిక్స్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇవి కాలేయ క‌ణాలు క్యాన్స‌ర్ క‌ణాలుగా మార‌కుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయని ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. తాజా అంజీరా పండ్లు ల‌భించ‌న‌ప్పుడు డ్రై అంజీరా పండ్ల‌ను కూడా తీసుకోవ‌చ్చ‌ు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.