తెలుగు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు మేలు – ప్రవాసుల అభిప్రాయం ఇదే !

విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన వారికి మాతృభూమిపై ఎనలేని మమకారం ఉంటుంది . అమెరికాలో ఉన్న ఎన్నారైలు.. ముఖ్యంగా తెలుగు వాళ్లు… తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నిత్యంత తపిస్తూ ఉంటారు. వీరు రాజకీయాలు తక్కువగా పట్టించుకుంటారు.. అభివృద్ధి ఎక్కువగా కోరుకుంటారు. ఇలాంటి వారంతా.. తెలుగు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు రావాలన్న అభిప్రాయంతో ఉన్నారు. అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాల సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన బీజేపీ నేతలతో అక్కడ ప్రవాసులు సమావేశం అవుతున్నారు. అభివృద్ధి ఆలోచనలు పంచుకుంటున్నారు..

అమెరికాలో తెలుగు ప్రజలతో సమావేశం అవుతున్న బీజేపీ నేతలు

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల నేతలు అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని తెలుగు సంఘాల సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొంత మంది తెలుగు ప్రముఖుల గ్రూప్ మీటింగ్స్ లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు .. తెలుగు రాష్ట్రాల్లో రావాల్సిన రాజకీయ మార్పుల గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే ఎక్కువ ప్రయోజనం అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. వేర్వేరు పార్టీలు అధికారంలో ఉడంటం వల్ల.. వేర్వేరు ప్రయారిటీల కారణంగా నిధుల దుర్వినియోగం అవుతున్నాయని అంచనా వేశారు.

రాజకీయ వ్యవస్త దిగజారడంపై ఆందోళన

సమాజంలో ఉన్నత విద్యావంతులు పెరుగుతున్నకొద్దీ రాజకీయాల్లో కులం, మతం, ప్రాంతం అనే భావనలు తొలగిపోవాలి. కానీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇవే పెరుగుతూండటం .. ప్రవాసుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటివి తగ్గినప్పుడే అభివృద్ధి రాజకీయాలు వస్తాయని భావిస్తున్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అభివృద్ధి ఆధారిత రాజకీయాలు చేస్తోందని.. అదే పద్దతిలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తే… అభివృద్ధి ఎజెండాగానే ప్రజాతీర్పు కోరితే… దేశానికి మంచి జరుగుతుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.

బీజేపీకి సహకరించేందుకు ప్రవాసుల ఆసక్తి !

భారతీయ జనతా పార్టీకి అమెరికాలో అత్యధిక మంది సానుభూతిపరులు ఉన్నారు. అయితే తెలుగువాళ్లు కాస్త తక్కువగా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్రాంతీయ పార్టీల సానుభూపరులు ఎక్కువగా ఉంటారు. అయితే ఇప్పుడు వారిలోనూ మార్పు వస్తోంది. ఉపాధి కోసం వేరే దేశానికి వచ్చి.. తాము ఓ ప్రాంతీయ వాదం వినిపించే ప్రాంతీయ పార్టీలకు మద్దుతుగా ఉండటం ఏమిటన్నది వారు చేస్తున్న ఆలోచన . అందుకే.. వారు.. . జాతీయవాదానికి మొగ్గు చూపుతున్నారు. అభివృద్ధి చెందాలంటే.. బీజేపీ వైపు ఉండాలనుకుంటున్నారు. తెలుగు కమ్యూనిటీ సమావేశాల్లో బీజేపీకి మద్దతు ప్రకటించేందుకు .. .. ఎన్నికల సమయం సహకరించేందుకు సిద్ధమని చాలా మంది బీజేపీ నేతలకు హామీ ఇస్తున్నారు.