ఆరోగ్యంపై శ్రద్ధ బాగా పెరిగింది. ఆహారం, ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేసేస్తున్నారు. వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ వర్కౌట్స్ కి కూడా వారానికి ఓ రోజు విరామం ఇవ్వాలంటారు ఆరోగ్య నిపుణులు. అంటే వారానికి ఆరు రోజులు ఫిట్ నెస్ పై దృష్టిపెడితే చాలు..ఓ రోజు రెస్ట్ తీసుకోవచ్చు..
వ్యాయామం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే విరామం లేని వ్యాయామం అస్సలు మంచిదికాదంటారు ఆరోగ్య నిపుణులు..ఎందుకంటే..
@ వారంలో ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వడం వల్ల శరీరం కణజాలానికి మరమ్మత్తులు చేసుకుంటుంది.
@ విరామం లేకపోవడం వల్ల ఎముకలు, కండరాలపై ఒత్తిడి పడుతుంది. అలాంటప్పుడు కణజాలం మరిన్ని ఇబ్బందులకు గురవుతుంది. కొన్నిసార్లు ఎముకలు విరిగిపోయే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడించారు
@ వ్యాయామం నుంచి విరామం తీసుకోవడం కండరాలకు మాత్రమే కాదు, మానసిక స్థితికి కూడా మేలు చేస్తుంది. రిఫ్రెష్ అయిన ఫీలింగ్ కలిగిస్తుంది
@ వారంలో ఓ రోజు వ్యాయామం చేయకుండా విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్రపడుతుంది. ‘ఫీల్ గుడ్’ హార్మోన్ అనుభూతిని ఇస్తుంది. మానసిక స్థితిని సరిగ్గా ఉంచుతుంది.
@ రోజూ వ్యాయామం చేస్తే శరీర కణజాలం, ఎముకలు ఇబ్బందులకు గురవుతాయి. కాబట్టి వ్యాయామానికి వారంలో ఒక రోజు విరామం ఇస్తే మంచిది. ఈ విషయంపై అమెరికన్ ఫిట్నెస్ సంస్థ ఏఐటీ మెథడ్ పరిశోధనలు చేసింది. 2వేల మంది ఇందులో పాల్గొన్నారు. తరువాత వచ్చిన ఫలితాలను విశ్లేషించి సైంటిస్టులు పైన తెలిపిన వివరాలను వెల్లడించారు.
ఒత్తిడితో కూడిన జీవనశైలిని అధిగమించడానికి వ్యాయామం తప్పనిసరి. అయితే మన శరీరం వ్యాయామం వల్ల మరింత ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే అంటారు ఆరోగ్య నిపుణులు…
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.