కాలీఫ్ల‌వ‌ర్‌తో ఇష్టం ఉండదా..అయితే మీరు ఈ ప్రయోజనాలు మిస్సైనట్టే!

నిత్యం వండుకునే కూరగాయల్లో కాలీఫ్లవర్ కూడా ఒకటి. దాదాపు ఏడాదంతా లభించే కాలీ ఫ్లవర్ వింటర్ సీజన్లో మరింత ఎక్కువ దొరుకుతుంది. దీంతో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటారు. అన్నంలోకి కర్రీ, రోటీ కర్రీ, కాలీ ఫ్లవర్ ఆవకాయ, మిగిలిన కూరగాయలతో కలిపి వండినా మంచి టేస్ట్ ఉంటుంది. అయితే కాలీ ఫ్లవర్ చాలామందికి ఇష్టం ఉండదు. అలాంటి వారు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు మిస్సవుతారో తెలుసా..

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది
కాలీఫ్లవర్ లో పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్స్, పాస్ప‌ర‌స్ వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. కాలీఫ్ల‌వ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో కూడా కాలీఫ్ల‌వ‌ర్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలోని మ‌లినాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోయి శ‌రీరం శుభ్ర‌పడుతుంది.

కాలీ ఫ్లవర్ జ్యూస్ బెటర్
రోజూ ప‌ర‌గ‌డుపున కాలీఫ్ల‌వ‌ర్ జ్యూస్ ను తాగ‌డం వల్ల క్యాన్స‌ర్ వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా కాలీఫ్ల‌వ‌ర్ ను తీసుకోవ‌డం వల్ల దంత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉండి ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కాలీఫ్ల‌వ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

ఎముకలు దృఢంగా ఉంటాయి
ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో కూడా కాలీఫ్ల‌వ‌ర్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. వారంలో రెండు సార్లు కాలీఫ్ల‌వ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

థైరాయిడ్ ఉన్నవారు తినొద్దు
కాలీ ఫ్లవర్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ హైప‌ర్ థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు దీనిని తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. కాలీఫ్ల‌వ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల టి3, టి4 హార్మోన్లు మ‌రింత ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. అలాగే కాలీఫ్ల‌వ‌ర్ లో క్యాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు కూడా దీనిని తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.