మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో దొండకాయ కూడా ఒకటి. వీటిని కొందరు ఇష్టంగా తింటే మరికొందరు మాత్రం మొదడు మొద్దుబారిపోతుందని అనుకుంటారు. కానీ దొండకాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు…
శరీరానికి అవసరమైన పోషకాలెన్నో
@ దొండకాయల్లో మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ప్రధానంగా వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
@ దొండకాయల జ్యూస్ రోజూ తాగినా లేదా వాటిని నేరుగా తిన్నా కూడా జీర్ణవ్యవస్థ శుభ్రం అవుతుంది. పేగులు, జీర్ణాశయంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్ సమస్య ఉండదు, కడుపులో మంట కూడా తగ్గుతుంది.
@ వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
@ దొండ కాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పొడొచ్చు. నీరసం, అలసట తగ్గుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి.
@ దొండకాయ జ్యూస్ తాగితే అధిక బరువు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. అలాగే వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలోకి వస్తాయి. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
@ దొండకాయ ద్వారా పీచు, ప్రొటీన్లు లభిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు హానికర బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి.
@ ఇందులో ఉండే క్యాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. మధుమేహవ్యాధిగ్రస్తులు కూడా నిక్షేపంగా తినవచ్చు.
@ రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉండే దొండకాయ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ తగ్గిస్తుంది
దొండకాయ తింటే బద్ధి మందగిస్తుందని జరిగే ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజువారీ తినే కూరగాయల్లో దొండకాయను కూడా భాగం చేసుకోవచ్చంటున్నారు….
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.