అసెంబ్లీలో అడుగు పెట్టడమే పెద్ద టాస్క్ గా పవన్ ఫీలవుతున్నారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ అవగాహనపై చాలా మందికి… మొదటి నుంచి అనేక మందికి అనుమానాలున్నాయి. నిలకడ లేని ఆయన మాటలే ఎప్పటికప్పుడు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తూ ఉంటాయి. తాజాగా వారాహియాత్ర ప్రారంభించిన తర్వాత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూసి జనసైనికులు కూడా నిరాశపడాల్సి వచ్చింది. అదేమిటంటే.. తాను ఎమ్మెల్యే కావడమే
టార్గెట్ కావడమే లక్ష్యమన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు. సీఎం పదవి ఇస్తే సంతోషంగా తీసుకుంటానంటున్నారు కానీ… గెలుస్తామని చెప్పడం లేదు.

పవన్ లో తగ్గిపోయిన ఆత్మవిశ్వాసం !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడమే మొదటి టార్గెట్ గా పెట్టుకున్నారని.. జనసేనను గెలిపించడం కాదని.. తేలిపోయింది. వారాహి యాత్ర ప్రారంభమైన సందర్భంగా తొలి సభను కత్తిపూడిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన .. తాను అసెంబ్లీలో ఎలా అడుగు పెట్టనో చూద్దామని సవాలు విసిరారు. తనను ఓడించడానికి గత ఎన్నికల్లో చేయాల్సినవి అన్నీ చేశారని.. ఈ సారి ఎన్ని చేసినా సరే అసెంబ్లీ అడుగు పెట్టి తీరుతానన్నారు. కచ్చితంగా జనసేన పాదముద్ర అసెంబ్లీలో పడుతుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే కక్ష కట్టి, తనను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వొద్దనే ఉద్దేశంతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు.

అసెంబ్లీలో అడుగు పెట్టడమే టార్గెట్ అయితే ఇంత ప్రయాస దేనికి ?

పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడివారు గెలిపిస్తారని ఇక్కడివారు.. ఇక్కడి వారు గెలిపిస్తారని అక్కడి వారు లైట్ తీసుకున్నారు. ఫ లితంగా రెండు చోట్ల ఓడిపోయారు. అదే సమయంలో పవన్ ను ఓడించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. సక్సెస్ అయ్యారు. ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదని చేసిన ప్రయత్నాల్లో విజయం సాధించారని… ఈసారి కూడా తనపై కుట్రలు జరుగుతాయని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అది నమ్మకం కన్నా .. భ యం అనే స్థాయికి చేరిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే .. అసెంబ్లీలో అడుగుపెడతానంటున్నారు కానీ..సీఎం పదవి పై ఆశలు పెట్టుకోలేకపోతున్నారు.

అసెంబ్లీలో అడుగు పెట్టడమే టాస్క్ అయితే ఇక సీఎం పదవి ఎలా ఆశించగలరు ?

పవన్ కల్యాణ్ మాటల ప్రకారం చూస్తే ఆయన సీఎం పదవిపై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని స్పష్టం అవుతుంది. ఆయన లక్ష్యం ఇప్పటికి ఎమ్మెల్యే కావడం. కానీ.,. నాగబాబు లాంటి వాళ్లు మాత్రం ప్రజల్ని.. జనసైనికుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. పవన్ సీఎం అయితే రాష్ట్రం మారిపోతుందని చెబుతున్నారు. కానీ అలాంటి కాన్ఫిడన్స్ పవన్ లో కనిపించండం లేదు. మొత్తంగా అసలు పవన్ ఎందుకు రాజకీయాల్లో పోటీ చేస్తున్నారో జనసైనికులకు చెప్పడంలోనూ… జనసేన పార్టీ ఫెయిలవుతోందన్న అభిప్రాయం మాత్రం ఎక్కువగా విస్తరిస్తోంది.