స్కిన్ తర్వాత ఎక్కువ మంది ఎక్కువ కేర్ తీసుకునేది జుట్టు సంరక్షణ విషయంలోనే. జుట్టు రాలకుండా పెరిగేందుకు ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. అమ్మాయిలైతే జుట్టు బాగా పెరిగేందుకు ఎప్పటికప్పుడు చివర్లు కట్ చేస్తుంటారు. ఇంతకీ చివర్లు కట్ చేస్తే జుట్టు పెరుగుతుందా?
ఆరోగ్యకరమైన జుట్టు కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు…ఆయిల్స్, షాంపూస్, హెన్నా..ఇంకా ఎన్నో ఎన్నో వినియోగిస్తారు. జుట్టు చివర్లు మడతపెడితే చిట్లిపోకుండా పెరుగుతుందని, కట్ చేస్తే గ్రోత్ ఇంకా ఫాస్ట్ గా ఉంటుందని భావిస్తుంటారు. ఇది నిజమా అంటే.. అదేం కాదంటారు నిపుణులు. ఇలాంటి చర్యలన్నీ జుట్టు పెరిగేలా చేస్తాయనుకోవడం అపోహ మాత్రమే అంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు జుట్టుని ట్రిమ్మింగ్ చేసుకోవడం వల్ల జుట్టు పెరగకపోవచ్చు కానీ అది జుట్టుని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది, ఆకృతిని అందంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా జుట్టు చివర్లు పగిలిపోయి ఉంటే వాటిని వెంటనే కట్ చేయడమే మంచిది లేదంటే..పూర్తిగా దెబ్బతింటుంది..జుట్టు రాలిపోతుంది. ఇలా నెలకోసారి స్పిట్స్ కట్ చేస్తే జట్టు పొడవు తగ్గిపోతుందని ఆందోళన చెందకుండా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు.
ఆయిల్ మసాజ్
వారానికోసారి ఫుల్లుగా ఆయిల్ పట్టించి జుట్టుని మసాజ్ చేయడం మంచిది. మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలని ప్రోత్సహించే ఫోలికల్స్ సహజంగా పని చేస్తాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది జుట్టు కుదుళ్లకు కావలసిన పోషకాలు, ఆక్సిజన్ ను అందిస్తుంది. అందుకే కొబ్బరి నూనె, ఆముదం, బాదం నూనె, హెడ్ మసాజ్ ఆయిల్ ఏదైనా మాడుకు మసాజ్ చేసుకోవడం మంచిది.
సమతుల్యమైన ఆహారం
జుట్టు అందంగా కనిపించేందుకు మంచి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. ప్రోటీన్, ఒమేగా 3 ఆమ్లాలు, జింక్ ఎక్కువగా అందె ఆహారపదార్థాలు తీసుకోవాలి. అందుకు ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా మీ డైట్లో భాగం చేసుకోవాలి.
ఉసిరి పొడి
వెంట్రుకలు పెరిగేందుకు ఉసిరి చక్కని ఉపాయం. ఇది జుట్టుకే కాదు చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉసిరి పొడి లేదా ఉసిరి కాయలు రెండింటితో జుట్టు పెంచుకోవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.