అవినీతి కేసుల్లో అరెస్టయిన చంద్రబాబునాయుడు నెల రోజుల నుంచి జైల్లో ఉన్నారు. అప్పట్నుంచి ఢిల్లీలో ఉన్న లోకష్… హఠాత్తుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు కూడా భేటీలో ఉండటంతో… వైసీపీని ఎదుర్కోవడానికి బీజేపీ సాయం కోసమే ఆయన సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. దీనిపై బీజేపీ హైకమాండ్ ఎలాంటి స్పందన వ్యక్తం చేసిందో స్పష్టత లేదు.
బయటకు తెలియకుండా అమిత్ షాతో లోకేష్ భేటీ
ఎవరూ ఊహించని విధంగా అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఈ భేటీ ఒక్క సారిగా రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. లోకేష్ తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దీంతో సహజంగానే రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అరెస్టుల వెనుక బీజేపీ ఉందని సీఎం జగన్ ప్రచారం చేస్తున్న అంశంపై ఇప్పటికి ఏపీ బీజేపీ స్పందించింది. సీఐడీ ఎవరి చేతిలో ఉందని చెబుతున్నారు. బీజేపీకి ఏమీ సంబంధం లేదని చెప్పడానికే అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారన్న అభిప్రాయ వినిపిస్తోంది.
బీజేపీతో కలిసి పని చేస్తామని చెప్పారా ?
తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తులు పెట్టుకుంటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. గతంలో చంద్రబాబు ఇప్పటికే సమయం మించిపోయిందని ప్రకటించారు. కానీ కిషన్ రెడ్డి కూడా లోకేష్ తో పాటు సమావేశంలో పాల్గొన్నారు. జగన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే… బీజేపీ మద్దతు కావాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారంటున్నారు. . టీడీపీ , జనసేనలతో కలిసి తెలంగాణలో పోటీ చేయాలన్ ఆలోచన కూడా చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఆ దిశగా ఈ సమావేశంలో చర్చ జరిగిందని కూడా చెబుతున్నారు. కారణం ఏదైనా ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు ఉండబోతున్నాయని చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలే !
తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉంటాయని బీజేపీ నేతలు గట్టి నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే జరిగేలా ఉందని భావిస్తున్నారు. టీడీపీ కూడా… బీేజపీ సాయానికి రావడంతో… బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి రాజకీయాల్లో మార్పులు ఉంటాయి. ఓ వారం పది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.