తినడం మానేస్తే బరువు తగ్గిపోతారనే అపోహలో ఉంటారు చాలామంది. అయితే తినడం మానేసినంత మాత్రాన బరువు తగ్గిపోరు..తినాల్సిన సమయంలో తీసుకోవాల్సిన ఆహారం తీసుకుంటేనే బరువుతగ్గుతారు, ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది అల్పాహారం ఎగ్గొడతారు…మరికొందరు ఆలస్యంగా నిద్రలేచి ఏకంగా లంచ్ చేసేస్తారు. కానీ బరువు తగ్గాలనుకునేవాళ్లు ఉదయం అల్పాహారం మానేయడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు, డైటీషియన్లు చెబుతున్నారు. అలాగని అతిగా తినడం కూడా మంచిది కాదు. ఓ క్రమపద్ధతిలో ఆహారం తీసుకుంటే కోరుకున్న శరీరాకృతి మీ సొంతమవుతుంది. ఇంతకీ పరగడుపున ఏం తినాలో, ఏం తినకూడదో చూద్దాం..
బాదం
పరగడపున తినడానికి బాదం చాలామంచిది. ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉంటాయి. ముఖ్యంగా బాదంలో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచి శుద్ధి చేస్తాయి. సహజంగా తీసుకునే ఆహారం ద్వారా వచ్చేఅనారోగ్యాలకు కూడా బాదం మందులా ఉపయోగపడతాయి. వీటిని నీటిలో నానబెట్టి తింటే టేస్టీగా ఉంటాయి తొందరగా జీర్ణం అవుతాయి.
తృణ ధాన్యాలు
బియ్యం, క్వీనా, మిల్లెట్, స్ప్లెట్ లో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇంకా వాటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్స్ రెగ్యులర్ బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తాయి. హార్ట్ అటాక్, టైప్ 2 డయాబెటిస్, ఓబేసిటి, క్యాన్సర్ లక్షణాలను నివారిస్తాయి.
పెరుగు
పెరుగు పెరుగులో ప్రోటీన్స్, అధికంగా ఉండటం వల్ల ఇవి కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.దీర్ఘకాలిక ఎనర్జీని అందిస్తాయి. పెరుగులో కొద్దిగా తేనె, కొన్ని నట్స్, సీడ్స్ మిక్స్ చేసి , ఫ్రూట్స్ కలిపి పరగడపున తినొచ్చు.
సిట్రస్ ఫ్రూట్స్
జీర్ణశక్తిని పెంచడంలో, ఎనర్జీలెవల్స్ , ఆకలిని పెంచడంలో లెమన్ సహాయపడుతుంది. పుచ్చకాయ, బొప్పాయి, జామ, మామిడి, దానిమ్మ పండ్లను పరగడపున తినొచ్చు. బొప్పాయిలో పెపైన్ అనే ఎజైమ్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ , థ్రోట్ ఇన్ఫెక్షన్, తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది,
చియా విత్తనాలు
మెక్సికోలో ఉద్భవించిన ఈ విత్తనాల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. కేవలం ఒక టీస్పూన్ గింజలు రాత్రంతా నానబెట్టి పరగడపునే తింటే బరువు కూడా తగ్గుతారు
ఖర్జూరం
పిల్లలకు ఖర్జూరపండు రోజు ఉదయం పరగడపున ఇవ్వడం వలన మెదడు చురుగ్గా పని చేస్తుంది. నైట్ అంతా నిద్రపోవడం వల్ల ఒంట్లొ చక్కెర శాతం తగ్గి లేస్తూనే నీరసంగా ఉంటారు. పరగడపున ఖర్జూరం తినడం వల్ల ఫుల్ హుషారుగా ఉంటారు. ఉదర సంబందం క్యాన్సర్లను నయం చేసే శక్తి ఖర్జూరాల్లో ఉంది. పక్షవాతం రాకుండా చెయడంలో చాలా తోడ్పడుతాయి. రక్తహీనతతొ బాధపడేవారికి ఖర్జూరాలు చాలా మంచి ఆహారం
గుడ్లు
గుడ్లలో ప్రోటీన్లు మరియు కొలెస్ట్రాల్ ఎక్కువ. పొట్ట నిండుగా ఉంచడానికి ఇది పర్ఫెక్ట్ ఫుడ్ . ఉదయం ఎనర్జీ అందివ్వడానికి ఇది బెస్ట్ ఫుడ్.
పుచ్చకాయలు
వాటర్ మెలోన్ హైడ్రేటింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్, అమినోయాసిడ్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఇవి వ్యాయామం తర్వాత మంచి ఎనర్జీని ఇస్తాయి. కణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్, డయాబెటిస్, మాస్కులర్ డిసీజ్, కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ ను నివారిస్తుంది.
పరగడపున తీసుకోకూడని వాటి విషయానికొస్తే….ఫ్రూట్ జ్యూస్ లు, శీతలపానీయాలు, టీ లేదా కాఫీలు అస్సలు పరగడుపున తీసుకోరాదు… అల్పాహారం తీసుకున్నాక తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే ఏమవుతుందనే డౌట్ రావొచ్చు…ఈ జ్యూస్ లు బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతాయి. ఫ్రూట్ జూసులకు బదులుగా ఫ్రెష్ ఫ్రూట్స్, విటమిన్స్, మినిరల్స్, మరియు ఫైబర్ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్సెస్ షుగర్స్ చేరకుండా నివారించుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.