హోలీ ఆడతారా – మరి చర్మం, జుట్టు పాడవకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

చిన్నా పెద్దా అందరూ ఇష్టంగా, సంబరంగా జరుపుకునే పండుగ హోలీ. దివాలీ తర్వాత అందరూ అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగ కూడా హోలీనే అని చెప్పాలి. అయితే పండుగ ఆనందం నిలిచిఉండాలంటే అనారోగ్యం పాలవకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హోలీ రంగులు పడి చర్మం, జుట్టు పాడవకుండా కొన్ని టిప్స్ పాటించడం బెటర్..

కెమికల్ కలర్స్ తో జాగ్రత్త
అప్పటి రోజుల్లో సహజ రంగులను వినియోగించేవారు…ఆ రంగుల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న రంగులన్నీ కెమికల్స్ కలిపినవే. ఇవి చర్మంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఈ రంగులు కలిపిన నీళ్లు..చర్మంపై, జుట్టుపై పడడం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ఆయిల్ అప్లై చేయండి
హోలీ ఆడే ముందు జుట్టు, చర్మానికి కచ్చితంతగా ఆయిల్ అప్లై చేయండి. బాదం, కొబ్బరినూనె ఏదైనా అప్లై చేయొచ్చు. ఇవి మీకు రక్షణ పొరలా హోలీ కలర్స్‌తో మీపై ఎఫెక్ట్ పడకుండా చూపిస్తాయి. కెమికల్స్ చర్మం, వెంట్రుకల్లోకి చొచ్చుకుపోకుండా ఉంటాయి…పైగా మీపై పడిన రంగులు తొందరగా కడుక్కోవచ్చు కూడా…

సన్ స్క్రీన్ లోషన్ వాడండి
సన్‌స్క్రీన్ లోషన్ వాడడం మర్చిపోవద్దు. SPF ఉన్న సన్‌స్క్రీన్‌ని వాడితే ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

గోర్లు క్లీన్ చేయాల్సిందే
చర్మం, జుట్టుని కాపాడుకున్నట్టే గోర్లని కూడా కాపాడాలి. లేకపోతే నీరు, సింథటిక్ కలర్స్ గోర్లని బలహీనంగా చేస్తాయి. రంగు నీరు బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది. దీని వల్ల ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, రంగు మారడం, గోళ్ళ నొప్పులు వస్తాయి.

స్కార్ఫ్ వాడడం బెటర్
కలర్స్ నుంచి మీ జుట్టుని కాపాడుకోవాలంటే టోపీ, స్కార్ప్ వినియోగించడం బెటర్. శరీరం మొత్తం కప్పిఉంచేలా దుస్తులు వేసుకోండి. అలాంటప్పుడు కలర్స్ మీ స్కిన్ లోకి చొచ్చుకుపోకుండా ఉంటాయి.