గోత్రం…హిందువులకు అతి ముఖ్యమైనది. నిత్యం చేసే పూజలు మొదలు మూడుముళ్లు ముడిపడే వరకూ గోత్రానికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. అయితే ఒకే గోత్రం ఉండేవారికి ఎందుకు వివాహం చేయకూడదని చెబుతారు? గోత్రం అనే వ్యవస్థ ఎందుకు ఫాలో అవుతున్నారు?
గోత్రం వివాహాలకు చాలా ముఖ్యమైనది భావిస్తారు. కొడుకులకు వారసత్వంగా వచ్చే గోత్రం కూతుర్లకు మాత్రం రాదు ఎందుకంటే పెళ్లి తర్వాత ఆడపిల్ల గోత్రం మారిపోతుంది. ఇదంతా ఎందుకు..దీనివెనుక ఆధ్యాత్మిక కారణాలున్నాయా అంటే..అంతకు మించి జన్యుపరమైన కారణాలున్నాయంటారు.
గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది.
మొదటి పదం ‘గౌ’- అంటే ఆవు
రెండవ పదం ‘త్రాహి’ అంటే కొట్టం
గోత్రం అంటే ‘గోశాల’ అని అర్ధం
జీవశాస్త్రపరంగా
మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి, వీటిల్లో తండ్రి నుంచి తల్లికి వెళ్లే క్రోమోజోముల వల్ల కడుపులో బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తుంది.
గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే అమ్మాయి అవుతుంది, అదే XY అయితే అబ్బాయి అవుతాడు.
XY లో – X తల్లి నుంచి Y తండ్రి నుంచి తీసుకుంటుంది.
ఈ Y క్రోమోజోమ్ ప్రత్యేకమైనది. అది X లో కలవదు. XY లో…Y X ని అణచివేస్తుంది అందుకే Y క్రోమోజోమ్ వృద్ధి చెంది కొడుకుపుడతాడు. ఈక్రోమోజోమ్ కేవలం మగవారికి మాత్రమే వెళుతుంది. అంటే తండ్రి నుంచి కొడుకు మనవడు ముని మనవడు ఇలా. అంటే మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందుకే వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా పుట్టినప్పుడు తండ్రి గోత్రం..పెళ్లి తర్వాత భర్త గోత్రం తనదవుతుంది.
ఒకే గోత్రానికి చెందినవాళ్లకి పెళ్లిచేస్తే
ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి. ఒకే గోత్రంలో వివాహం చేసుకుంటే సంతానం విషయంలో సమస్యలు ఏర్పడతాయని, పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతోనో, మానసిక వైకల్యంతోనో పుట్టే అవకాశం ఉంటుందని చెబుతారు. పైగా ఒకే గోత్రానికి చెందిన వారికి వివాహం చేస్తే వారికి పుట్టే పిల్లలకు మాత్రమే కాదు ఆ తర్వాత తరాల వారికి కూడా అనారోగ్య సమస్యలు బదిలీ అవుతాయని చెబుతారు. పైగా ఒకే గోత్రానికి చెందిన అబ్బాయి, అమ్మాయి వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు కాబట్టి వీరి వివాహం చేసుకోకూడదని చెబుతారు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.