విటమిన్ సి పుష్కలంగా ఉండే ఫుడ్స్ లో ఉసిరి ఒకటి. ఈ సీజన్ లో పండే ఆకుపచ్చ పండ్లలో నారింజ కంటే 20 రెట్లు ఎక్కవగా విటమిన్ సి ఉసిరిలో ఉంటుంది. చల్లని వాతావరణం కారణంగా జబ్బులబారిన పడతారు. అలాంటి వారికి రోగనిరోధక శక్తి పెంపుదలకు సి విటమిన్ అధికంగా కలిగిన ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉన్నాయి. ఉసిరి రక్తంలో చక్కెర, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి…
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
ఉసిరి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరం వైరస్ లు, బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆమ్లాలో తగినంత కొల్లాజెన్ లభిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల ముడతల సమస్య తగ్గుతుంది, మచ్చలు మాయమైపోతాయి. ఉసిరి రోగ నిరోధకతను మెరుగు పరుస్తుంది. ఇంకా జలుబు, దగ్గు సర్వసాధారణం. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని రోజువారీ వినియోగం జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఉసిరికాయతో తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి…
హిమోగ్లోబిన్ స్థాయి పెంచుతుంది
శరీరంలో రక్త పరిమాణం, హిమోగ్లోబిన్ స్థాయి ని పెంచడంలో ఉసిరి సహాయపడుతుంది. అన్ని అవయవాలకు సరైన పోషకాలు అందడంలో సహకరిస్తుంది. ఉసిరికాయను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవు. ఇక ఉసిరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.. మలబద్ధకం, విరేచనాలు లాంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
జుట్టు ఆరోగ్యానికి మంచిది
ఉసిరి నూనె జుట్టును బలపరుస్తుంది. చుండ్రు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆమ్లా ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల జుట్టు నల్లగా ఉంటుంది.. ఇంకా ఎన్నో సమస్యలను ఉసిరి తగ్గిస్తుంది.
వీళ్లు తీసుకోపోవడమే మంచిది
ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. టైప్ 1 ,టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులకు ఉసిరి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, రక్తంలో చక్కెర స్థాయిని కలిగి ఉన్నవారికి, యాంటీ-డయాబెటిక్ మందులు తీసుకునే వారికి ఇది మంచిది కాదు. కాబట్టి, డయాబెటిక్ రోగులు యాంటీ-డయాబెటిక్ మందులతో కలిపి ఉసిరిని తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించటం మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.