వర్షాకాలంలో తడిబట్టలు వాసనొస్తున్నాయా – అయితే ఇలా చేయండి!

వానాకాలం మొదలైందంటే బట్టలతో పెద్ద సమస్యే. ఉతికిన దుస్తులు ఒకంతట ఆరవు. నాలుగైదు రోజులు గాలి తగిలేలా ఉంచినా కానీ అదో రకమైన వాసన వస్తాయి కానీ పూర్తిగా పొడిబారవు. ఆ వాసన తొలగించేందుకు కొన్ని చిట్కాలు మీకోసం..

సరిగ్గా ఎండని బట్టలను అలాగే మడతపెట్టి పెట్టేయడం వలన ఆ తడి బట్టల్లో బ్యాక్టీరియా చేరుతుంది. ఆ దుస్తులు ధరిస్తే చర్మానికి సంబంధించిన సమస్యలు తప్పవు. అందుకే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం మంచిది.
@ బట్టలు ఉతికిన తర్వాత కర్పూరం కలిపిన నీటిలో ఆ బట్టలను ముంచి నీటిని బాగా పిండిసే ఆరబెడితే దుర్వాసన రాకుండా ఉంటాయి.
@ తడి బట్టలు తేమ వల్ల దుర్వాసన రావడం ప్రారంభిస్తే బకెట్ నీళ్లలో నిమ్మరసం కలిపి అందులో బట్టలను కాసేపు నానబెట్టాలి. నిమ్మకాయలోని సహజ యాసిడ్ దుర్వాసనను తొలగించి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
@ వానకారణంగా పూర్తిగా ఆరకపోయినా వాటిని తీసుకొచ్చి ఫ్యాన్ కింద వేసి ఉంచండి కానీ మడతపెట్టేసి పెట్టేయవద్దు.
@ బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆ నీటిలో కొంచెం బేకింగ్ సోడా కలపండి. ఇలా చేయడం వల్ల బట్టల వాసన కూడా తొలగిపోతుంది.
@ బట్టలు ఉతికే నీటిలో మీ డిటర్జెంట్‌తో పాటు కొంచెం వెనిగర్ కలపండి.
@ ఇది చెడు వాసనలను తొలగిస్తుంది. బట్టలు పూర్తిగా ఆరిన తర్వాతే అల్మారాలో పెట్టండి.
@ తడిబట్టలను లేదా సరిగ్గా ఆరని బట్టలను అలాగే మడతపెట్టి పెట్టడం వలన బట్టలు ముక్కిపోయిన వాసన వస్తాయి.
@ మడతపెట్టి పెట్టిన దుస్తుల దొంతర్లలో నాఫ్తలిన్ వేయడం మర్చిపోవద్దు. ఇవి క్రిమి కీటకాలను తరిమికొడతాయి.

ముఖ్యంగా కార్యాలయాలకు, వ్యాపార పనులపై వెళ్లేవారు, స్కూల్ పిల్లల దుస్తుల విషయంలో ఈ చిట్కాలు పాటించడం మంచిది. వీరి బ్యాగుల్లో అదనంగా ఓ డ్రెస్ ఉంచడం ఇంకా ముఖ్యం. వర్షాన్ని అస్వాదించాలనే ఆనందం చాలామందిలో ఉంటుంది .కానీ ఇప్పుడు వాతావరణం చాలా మారిపోయింది అందుకే వానలో తడిస్తే ఆ క్షణం ఆనందాన్ని పొందినా ఆ తర్వాత అనారోగ్యం తప్పదు. అందుకే అలాంటి సరదాల జోలికి పోవద్దంటున్నారు ఆరోగ్యనిపుణులు..స్కిన్ కి సంబంధించిన సమస్యలతో పాటూ వైరల్ ఫీవర్స్ కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వానలో తడసివస్తే ఆ దుస్తులను వెంటనే మార్చుకుని గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలని సూచిస్తున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం