బాదం పప్పులు తినేవారికి ఈ విషయాలు తెలుసా!

ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టి. బాదం ప‌ప్పు చ‌క్క‌టి రుచితో పాటు ఎన్నో పోష‌కాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది. చాలా మంది ఈ బాదం ప‌ప్పును రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అయితే ఈ బాదం ప‌ప్పును ఎలా తినాలి, ఎన్ని తినాలో తెలుసా..

పొట్టుతో తినొద్దు
బాదం పప్పును నేరుగా తీసుకోవ‌డం కంటే నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ రాత్రి ఒక అర క‌ప్పు నీటిలో 5 లేదా 6 బాదం ప‌ప్పుల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ బాదం ప‌ప్పుపై ఉండే పొట్టును తీసేసి ఆహారంగా తీసుకోవాలి. బాదం ప‌ప్పు పై ఉండే ఉండే పొట్టులో ట్యానిక్ అనే ఒక ప‌దార్థం ఉంటుంది. ఇది మ‌న శరీరం పోషకాల‌ను గ్ర‌హించ‌కుండా చేస్తుంది. అందుకే బాదంపై ఉండే పొట్టును తీసేసి తినాలి.

ఎన్ని తినాలి
రుచిగా ఉన్నాయని, ఆరోగ్యానికి మంచిదని మోతాదుకి మించి తినడం సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకి కేవలం 4 లేదా 5 బాదం పప్పులు తింటే సరిపోతుంది.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
నాన‌బెట్టి పొట్టు తీసిన బాదం పప్పులో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. అధిక బ‌రువును త‌గ్గించ‌డం ద‌గ్గ‌రి నుంచి బీపీ నియంత్రించ‌డం వ‌ర‌కు అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డం దగ్గ‌ర నుంచి క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా చేసే వ‌ర‌కు బాదం ప‌ప్పు చేసే మేలు అంతా ఇంతా కాదు.
@ వీటిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్ ఇ ల‌తో పాటు ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. ప్రోటీన్ కార‌ణంగా మ‌న‌కు ఎక్కువ‌గా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది..దీంతో బ‌రువు తగ్గ‌వ‌చ్చు.
@ బాదం పప్పు రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా మార‌తాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. బీపీ కూడా అదుపులో ఉంటుంది.
@ నాన‌బెట్టిన బాదం ప‌ప్పులో లిపేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది మ‌న జీర్ణ‌క్రియను మెర‌గుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచ‌డంలో సహాయపడుతుంది
@ బాదంలో ఉండే విటమిన్ 17, ప్లెవ‌నాయిడ్స్ క్యాన్స‌ర్ ముప్పును త‌గ్గించ‌డంతో పాటు ట్యూమ‌ర్స్ ను కూడా పెర‌గ‌కుండా చేస్తుంది
@ గ‌ర్భిణీ స్త్రీలు రోజూ నాన‌బెట్టిన బాదం ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల త‌గినంత ఫోలిక్ యాసిడ్ ల‌భించి గ‌ర్భ‌స్థ శిశువు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. గ‌ర్భిణీల్లో వ‌చ్చే రక్త‌హీన‌త కూడా త‌గ్గుతుంది.

నేరుగా తినడం కన్నా ఏడెనిమిది గంటలు నానబెట్టి తినడం వల్లే బాదం పప్పు నుంచి సరైన ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు…

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.