ప్రెజెంట్ మనం తీసుకుంటున్న ఫుడ్ కారణంగా అసిడిటీ, గ్యాస్, కడుపులో మంట లాంటి సమస్యలు 90శాతం మందికి కామన్ అయిపోయాయి. చిన్నపెద్ద అన్న తేడాలేకుండా అందరికి ఇదే ఇబ్బంది. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా మళ్లీ తెల్లారేసరికి మొదలు.. అందుకే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు
కడుపులో మంట, త్రేన్పులు, కడుపు ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం, వంటి సమస్యలతో సతమతం అయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అసిడిటీ కలిగించే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, అజీర్తి సమస్యలు, అధిక కారం, మసాలాలను తరచుగా తీసుకోవడం, టైమ్ దాటి భోజనం చేయటం, ఎక్కువగా నీళ్లు తాగకపోవటం లాంటి ఎన్నో కారణాల వల్ల ఏజ్ తో సంబంధం లేకుండా ఈ సమస్య చుట్టుముడుతోంది. దీన్నించి బయపడేందుకు కుప్పలు తెప్పలుగా ఇంగ్లిష్ మెడిసిన్ పై డిపెండ్ అయిపోకుండా ఇంటి వంటగదిలో ఉండే వాటితో ఉపశమనం పొందొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ చిట్కాలేంటో చూద్దాం…
@ గ్లాసుడు పాలు తీసుకుని వాటిని బాగా మరిగించి చల్లార్చాలి. ఆ తర్వాత ఆ పాలకి సగం గ్లాస్ వాటర్ కలిపి ఆ మిశ్రమంలో ఒక టీస్పూన్ ఆవు నెయ్యి వేసి బాగా కలిపి తాగాలి. ఇలా చేయడం వలన అసిడిటీ, కడుపులో మంట నుంచి వెంటనే విముక్తి లభిస్తుంది. జీర్ణాశయంలో ఏర్పడ్డ ఇబ్బందులు తొలగిపోతాయి.
@ భోజనం చేసిన తర్వాత చల్లని పాలు తాగాలి. పాలలో ఉండే కాల్షియం కడుపులో అధికంగా ఉన్న ఆమ్లాలను పీల్చుకుని గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది
@ ఒక కప్పులోకి అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ నల్ల ఉప్పు, ఒకటిన్నర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని సేవించాలి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.
@ ప్రతి రోజు కొబ్బరి నీళ్లను తాగినా కడుపులో తయారయ్యే కొన్ని యాసిడ్ల ప్రభావం తగ్గి గ్యాస్ సమస్య త్వరగా తగ్గుతుంది.
@ కడుపులోని మ్యూకస్ పొరను రక్షించే ఔషధంగా తేనె సహకరిస్తుంది. అందువల్ల ప్రతి రోజూ ఒక స్పూన్ తేనెను సేవిస్తే ఎసిడిటీ సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
@ యాలకులు గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. కొన్ని యాలకులను తీసుకుని బాగా స్మాష్ చేసి ఒక గ్లాస్ నీటిలో మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టుకుని తాగితే అధికంగా విడుదలయ్యే యాసిడ్ల మూలంగా కడుపు లోపలి భాగంలో ఉండే చర్మానికి హాని కలగకుండా ఉంటుంది.
@ ఒక్కోసారి ఈ అసిడిటీ సమస్య ఎక్కువగా ఉంటే గుండెల్లో నొప్పి వస్తుంది. కంగారు పడకుండా కొంచెం వేడి నీళ్లు తాగితే కాసేపటికి గ్యాస్ రిలీజ్ అయ్యి నొప్పి తగ్గుతుంది. వీటన్నిటికంటే టైమ్ కి తిని, టైమ్ కి నిద్రపోతే చాలు. హెల్ది ఫుడ్ తీసుకోండి. ఎక్కువగా వాటర్ తాగండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.