ఏపీలో మంత్రులకు తమ శాఖలేవో తెలుసా ? – విష్ణువర్ధన్ రెడ్డి కిచన్ క్యాబినెట్ వ్యాఖ్యలతో కొత్త చర్చ !

ఏపీలో ఉన్నది కిచన్ క్యాబినెట్ కదా మంత్రులు ఎందుకు తమ శాఖల అంశాలపై స్పందించడం లేదని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి .. వేసిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. నిజంగానే ఏపీ మంత్రులు ఏం చేస్తున్నారు ? నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు ? అసలు మంత్రులు చేసే ప్రకటనలు … వారి శాఖలకు చెందినవేనా అన్న విశ్లేషణలు చేస్తున్నారు. ఇందులో తేలుతున్నదేమిటంటే… అసలు మంత్రులు ఎప్పుడూ తమ శాఖలపై స్పందించడం లేదు.. ఇతరులు మాట్లాడుతున్నారు. అసలు దేనిపై మాట్లాడున్నారో వారికి తెలియనంతగా ఉంటుంది. అసలు కేబినెట్ ను పెట్టుకుని వేరే కేబినెట్ సీఎం పరిపాలన చేస్తున్నారన్న నిజాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

అసలు డిప్యూటీ సీఎంలకైనా తమ శాఖలేవో తెలుసా ?

ఏపీలో పేరుకు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారు. సీఎం తర్వాత డిప్యూటీ సీఎం పవర్ ఫుల్ అనుకుంటారు. కానీ కిచన్ క్యాబినెట్ లో కాదు. ఓ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆయన పై కానిస్టేబుల్ తిరగబడితే.. .. ఆ కానిస్టేబుల్‌పై కేసులు పెట్టించడానికి ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూంటారు. కానీ అది కూడా చేయలేక దొరికిపోతారు. ఇతర డిప్యూటీ సీఎంంలు అంతే. వారెవరూ తమ శాఖలపై ప్రటనలు చేయరు. అసలు సమీక్షలు చేయడం అనేదే ఉండదు. మరి వారంతా ఏం చేస్తూంటారు.. పరిపాలన ఎవరు చేస్తూంటారు…?

ఏ అంశంపై ఎవరు మాట్లాడతారో ఎవరికీ తెలియదు !

సాధారణంగా ప్రభుత్వం అంటే.. ముఖ్యమంత్రి..మంత్రులు. మంత్రులకు ఎవరి శాఖలు వారికి ఉంటాయి. వారి వారి శాఖలపై వారు సమీక్షలు చేస్తారు. సమస్యలు వచ్చినప్పుడు వారే స్పందిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరు మాత్రం భిన్నం. ఏ శాఖ మంత్రి అయినా … అన్నింటిపై స్పందిస్తారు. తనకు సంబంధం లేని శాఖలపై ప్రెస్‌మీట్ పెట్టి ఎడాపెడా ప్రసంగించేస్తారు. సంబంధిత శాఖ మంత్రి మాత్రం జాడ ఉండరు. కరెంట్ చార్జీల గురించి బొత్స సహా చాలా మంది మాట్లాడతారు. కానీ అసలు కరెంట్ మంత్రికి మాత్రం దీనిపై అవగాహన ఉండదు. ఆర్థిక శాఖపై అప్పులపై బుగ్గన మాట్లాడి చాలా కాలం అయింది. పనిలో పడి తమ శాఖ ఏదో మంత్రులు మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రులకు తాము ఏ శాఖల మంత్రులమో.. గుర్తు లేనట్లుగా..ఇతరుల మంత్రిత్వ శాఖల్లోని అంశాలను.. విశదీకరిస్తూ ఉంటారు. మీడియాలకు గంటల తరబడి ఇంటర్యూలు ఇస్తూ కనిపిస్తున్నారు.

అందరూ అన్ని శాఖలపై అవగాహన పెంచేసుకుంటున్నారా..?

సిట్యూయేషన్ డిమాండ్ చేస్తోంది.. సీనియర్లుగా ఆ బాధ్యతలు పంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి.. తమ సీనియార్టీ మేరకు బాధ్యత తీసుకున్నారని అనుకుందాం. కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల్లోనూ అదే పరిస్థితి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి… పంచాయతీరాజ్ చట్టం గురించి అనర్గళంగా ప్రసంగిస్తారు. విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ ఆర్థిక అంశాలు.. వ్యవసాయ అంశాలపై ప్రకటనలు చేస్తూ ఉంటారు. రైతులు ఎవరూ ఇబ్బంది పడటం లేదని.. దమ్ముంటే..తనతో వచ్చి చూపించాలని బొత్స సవాల్ చేస్తూ ఉంటారు. ఇలా మంత్రులు అసలు ఏం ప్రకటనలు చేస్తూంటారో వారికీ తెలియదు.

ఇన్నర్ కేబినెట్ వేరే ఉందా ?

ఏపీ సర్కార్‌లో మంత్రులు డమ్మీలనే ప్రచారం ఉంది. వారు ఏం మాట్లాడాలి.. ఎప్పుడు మాట్లాడాలన్నది నోట్ రూపంలో వస్తుంది..మాట్లాడతారని అంటారు. ఆయా మంత్రులకు పదవులు.. పదవులకు మాత్రమే. వారు చేసేదేమీ ఉండదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వానికి కొంత మంది సలహాదారులు ఉన్నారు. వారే అనధికారిక పాలకులన్న ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు సలహాదారులు చాలా యాక్టివ్ గా ఉంటారు. మొత్తం వ్యవహారాలన్నీ వాళ్లే చక్కబెడతారని.. సెక్రటేరియట్‌లో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకే కిచన్ క్యాబినెట్ అంటున్నారు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటనతో ఈ వ్యవహారం అంతా మరోసారి తెరపైకి వచ్చింది.