మహేశ్వరంలో సబితకు గడ్డు పరస్థితి – చరిత్ర సృష్టించనున్న బీజేపీ బీసీ నేత

రంగారెడ్డి జిల్లా హాట్ సీటుగా ఉన్న మహేశ్వరంలో బీజేపీ దూకుడు మీద ఉంది. చాలా కాలంగా సబితా ఇంద్రారెడ్డి వంటి నేతపై పోరాడుతున్న అందెల శ్రీరాముల యాదవ్ పై ప్రజల్లో సానుభూతి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ వర్గ పోరాటంతో పాటు… ఆయన ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాకపోవడంతో రేసులో లేకుండా పోయారు.

సెటిలర్ల ఓట్లు ఎక్కువ

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు. అయితే సొంత పార్టీలోనే వర్గ పోరు తలనొప్పిగా మారింది. తీగల కృష్ణారెడ్డి లాంటి నేతలు సహకరించడం కష్టంగా మారింది. కొంత గ్రామీణం.. కొంత పట్టణం.. ఇంకొంత నగరం.. ఇలా.. 3 రకాల ప్రాంతాలు కలిసుండే నియోజకవర్గం.. మహేశ్వరం. రియల్ ఎస్టేట్ జోరుతో.. ఈ సెగ్మెంట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయ్. సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ, అమెజాన్ డాటా సెంటర్, సమీపంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు.. ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయ్. 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడింది. దీని పరిధిలో.. కందుకూరు, మహేశ్వరం మండలాలతో పాటు తుక్కుగూడ మున్సిపాలిటీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సరూర్‌నగర్ ప్రాంతం కొంత కలిసి ఉంటుంది. వీటిలో.. కందుకూరు మండలం గ్రామీణ ప్రాంతంగా ఉంటుంది. అందుకే సెటిలర్ల ప్రభావం ఎక్కువ.

సబితా ఇంద్రారెడ్డికి ఎదురుగాలి !

హేశ్వరం నియోజకవర్గానికి ఇప్పటివరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో తొలిసారి కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత.. 2014 ఎన్నికల్లో హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి.. టీడీపీ తరఫున గెలిచి.. తర్వాత గులాబీ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి.. మహేశ్వరంపై తన పట్టు నిలుపుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. తర్వాత.. ఆవిడ బీఆర్ఎస్‌లో చేరడం, సీఎం కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా చోటు దక్కించుకోవడం జరిగాయి. అయితే ఇప్పుడు మహేశ్వరంలో ఈసారి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడి వ్యవహారశైలి ఆమెకు మనస్‌గా మారింది.

గెలుపు దిశగా అందెల శ్రీరాములు యాదవ్

మహేశ్వరంలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే.. తుక్కుగూడ మున్సిపాలిటీ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో సరూర్‌ నగర్ డివిజన్‌ని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. దాంతో.. ఎన్నికలపై బీజేపీ నేతలు గెలుపు గట్టి నమ్మకం పెట్టుకున్నారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అందెల శ్రీరాములు యాదవ్‌ పోటీచేస్తున్నారు. శ్రీరాములు యాదవ్ ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ప్రజల్లో సానుభూతి ఉంది. అందుకే గెలుపు ఖాయమనే భావనలో ఉన్నారు.