పదవుల్లో ఉన్న డిప్యూటీ సీఎంలకూ టిక్కెట్ల గండం ఉన్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతన్నాయి. సీఎం జగన్ నిర్వహించిన సర్వేల్లో వెనుకబడిన వారిని నిర్మోహమాటంగా బయట పెట్టనున్నారు. ఈ జాబితాలో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే , డిప్యూటీ సీఎం కిలత్తూరు నారాయణస్వామి ఉన్నారని చెబుతున్నారు. ఆయనకు టిక్కెట్ లేదని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.
నారాయణ స్వామిపై తీవ్ర వ్యతిరేకత
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు(ఎస్సీ) నియోజకవర్గం నుంచి నారాయణ స్వామి వరుస విజయాలు దక్కించుకున్నారు. కానీ ఆయన వివాదాస్పద తీరుతో సొంత పార్టీ నేతలకు దూరమయ్యారు. డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించినా ఉపయోగించుకోలేకపోయారు. గడప గడపకూ వెళ్లినప్పుడు ఆయనను చాలా గ్రామాల్లో అడ్డుకున్నారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరిగింది. అందుకే నారయణస్వామి పరిస్థితి అడకత్తెర లో పోక మాదిరిగా మారిందని వైసీపీ లోనూ చర్చకు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం మాట ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఆయన కు టికెట్ దక్కడం కూడా కష్టమనే సంకేతాలు వచ్చాయి.
టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న కుతూహలమ్మ తనయుడు
2014 2019 ఎన్నికల్లో ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. వేపంజేరి నియోజకవర్గంగా ఉన్న దాని ని విభజన చేసి.. 2009లో గంగాధర నెల్లూరు అనే కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేశారు. ఎన్నికల కు వచ్చేసరికి అంటే.. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకుని.. ఆ పార్టీ టికెట్ పై పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో నారాయణస్వామి విజయం దక్కించుకు న్నారు. తర్వాత కుతూహలమ్మ.. తన కుమారుడు హరికృష్ణను రంగం లోకి దించారు. ఈయన 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక తర్వాత జరిగిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో హరికృష్ణ కుతూహలమ్మలు వైసీపీ చెంత కు చేరిపోయారు.
హరికృష్ణకు మంత్రి పెద్దిరెడ్డి మద్దతు
మంత్రి పెద్దిరెడ్డి ఎవరికి చెబితే వారికే టిక్కెట్ ిస్తారు. కుతూహలమ్మ చనిపోయిన తర్వాత ఆమె కుమారుడు హరికృష్ణ
చురుకుగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ను తప్పించి హరికృష్ణకు టికెట్ ఇవ్వాలనే నినాదం అంతర్గత చర్చల్లో జోరుగా వినిపిస్తోంది. దీంతో ఆయన కు అవకాశం ఇచ్చే చాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. హరికి టికెట్ ఇస్తే.. రెండు ప్రయోజనాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒకటి.. కుతూహలమ్మ మరణంతో ఏర్పడిన సింపతీ రెండు మంత్రి నారాయణస్వామి పై ఉన్న వ్యతిరేకత. ఈ రెండు కూడా హరికృష్ణ విజయానికి కారణమవుతారని చెబుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆలోచన కూడా ఇదే అంటున్నారు.