మళ్లీ చంద్రబాబును మోసేస్తున్న కేశినేని నాని – బ్లాక్ మెయిల్ చేసి టిక్కెట్ కన్‌ఫర్మ్ చేసుకున్నారా ?

విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు మారిపోయింది. టిడిపి అధిష్టానంపై, ఆ పార్టీ నేతలపై ఎప్పుడూ దూకుడుగా మాట్లాడే విజయవాడ ఎంపీ కేశినేని నాని మార్పు వచ్చిందా అన్న సందేహం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. టిడిపి అధినేత చంద్రబాబును, పార్టీని పొగుడుతూ ఆయన మాట్లాడడమే ఇందుకు కారణంగా ఉంది. 2019 ఎన్నికల తర్వాత నుండి ఎంపీ కేశినేని నాని అవకాశం వచ్చినప్పుడల్లా అధినేతతో పాటు, సొంత పార్టీ నాయకులు పట్ల దూకుడుగా మాట్లాడుతున్నాకుయ

విజయవాడ పార్లమెంట్ పరిధిలో అందరితోనూ గొడవలే

విజయవాడ పార్లమెంటు పరిధిలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తో తప్ప, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎంఎల్‌ఎలు బొండా ఉమా, షేక్‌ నాగుల్‌ మీరా, తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్య, మాజీ ఎంఎల్‌సి బుద్ధా వెంకన్న తదితరులతో ఎంపి కేశినేనినికి విబేధాలున్నాయి. ఓ దశలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు సామంతరాజులు కాదని, ఇన్చార్జి అంటే రాజ్యాంగ పదవి కాదని విమర్శలు గుప్పించారు. నాని వ్యవహార శైలితో విబేధించిన మాజీ మంత్రి దేవినేని ఉమా ఆయనకు పోటీగా ఆయన సోదరుడు కేశినేని చిన్నిని తెరమీదకు తీసుకువచ్చారు. దీంతో కేశినేని బ్రదర్స్‌ మధ్య ఉన్న విబేధాలు కొత్తగా తెరపైకి వచ్చాయి. ఈక్రమంలో కేశినేని చిన్ని….రెండేళ్లుగా విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఇన్చార్జులను కలుపుకొని కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇటీవల వైసీపీ నేతలతో కలిసి ఎక్కువగా తిరిగిన కేశినేని

ఎంపీ కేశినేని నాని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో వైసిపి ఎమ్మెల్యేలతో కలిసి అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యాక్రమాల్లో అధికార పార్టీ ఎంఎంల్‌ఎలను సైతం ప్రశంసించారు. దీనిని సాకుగా చూపి దేవినేని ఉమా గ్రూపుగా ఉన్న చిన్ని, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు ఈ విషయాన్ని అధిష్టానం దష్టికి తీసుకెళ్లారు. విజయవాడ పార్లమెంటుకు టిడిపి నుండి చిన్ని పోటీ చేస్తారని ప్రచారం చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ కూడా చిన్నికి సహకరించారు. ఈ దశలో ఎంపీ కేశినేని నాని టిడిపిని వీడతారని కూడా ప్రచారం జరిగింది. కానీ నాని మాత్రం అవేమీ పట్టించుకోకుండా, పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకొని అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

హఠాత్తుగా చంద్రబాబుపై పొగడ్తలు

చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. దేశంలో నీతీ నిజాయితీ, నిబద్ధత కలిగిన, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు చంద్రబాబు అన్నారు. అలాగే తన ఐడియాలజీ టిడిపి అని, వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటుకు టిడిపి నుండి పోటీ చేసి గెలిచి మూడోసారి పార్లమెంట్లో అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశారు. అంకితభావంతో ప్రజాసేవ చేసే వారికి రాజకీయ పదవులు వస్తాయన్నారు. ఎప్పుడూ ఏదో ఒకటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఎంపి కేశినేని…చంద్రబాబు పట్ల, పార్టీ పట్ల విధేయతగా మాట్లాడటంతో ఆయనతో మార్పు వచ్చిందా అని టిడిపి శ్రేణులు చర్చించుకుంటున్నాయి.