జనాలను ఫూల్స్ చేయడానికే జేడీ అలా చెప్పాడా!

ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు జేడీ చక్రవర్తి. ఆ తర్వాత దర్శకుడిగా మారి సినిమాలు చేశాడు. అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో మళ్లీ నటుడిగా బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. త్వరలో ‘దయ’ అనే వెబ్ సిరీస్ తో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రమోషన్స్ లో ఉన్న జేడీ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు.

నాపై హత్యాయత్నం జరిగింది-జేడీ
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేడీ తనపై హత్యాయత్నం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను చంపేందుకు స్లో పాయిజన్ ఇచ్చారని చెప్పాడు. అది కూడా 8 నెలల పాటూ జరిగిందన్నాడు. జేడీ మాటల ప్రకారం…. “వాస్తవానికి నాకు ఎలాంటి బ్యాడ్ హాబిట్స్ లేవు. కొంత కాలంగా క్రితం నాకు ఉన్నట్టు ఉండి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టం గా ఉండేది” . డాక్టర్ల దగ్గరకు వెళ్లినా వాళ్లు ఏం తేల్చలేకపోయారు. విదేశాల్లోనూ చూపించుకున్నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అప్పుడు నా ఫ్రెండ్, నిర్మాత శేషురెడ్డి నాకు మంచి వైద్యం ఇప్పించారు. డాక్టర్‌ నాగార్జున పరీక్షలు నిర్వహించి డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావు అడిని అడిగాడు. నాకు ఆ అలవాటే లేదని చెప్పాను కానీ నాకు తర్వాత అర్థం అయ్యింది నా శరీరంలోకి మత్తు పదార్థాలు ఎలా వెళ్లాయో. కషాయం పేరుతో తనకు స్లో పాయిజన్ ఇచ్చారని చక్రవర్తి తెలిపారు. ఎడిటింగ్‌ చేస్తున్న సమయంలో కషాయం తాగే అలవాటు ఉండేది ఓసారి నాతో ఉన్న నిర్మాత ఖాసీం కషాయం తాగుతానని చెప్పాడు. సరే అని తనకు ఇప్పించాను. ఆ కషాయం తాగి తను ఆస్వస్థకు గురయ్యాడు. ఇదే విషయాన్ని కషాయం తయారు చేసిన వ్యక్తికి చెప్పాను. నీ కోసం తయారు చేసిన కషాయం వేరేవాళ్లు ఎందుకు ఇచ్చావని తిట్టాడు. చివరకు హాస్పిటల్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, సుమారు 8 నెలల పాటు నా మీద విష ప్రయోగం జరిగింది. నేను రోజూ తీసుకున్న కషాయమే విషం అని తేలిందన్నాడు. ఆ కషాయం ఇచ్చింది ఎవరన్నది క్లియర్ గా చెప్పకపోయినా తన భార్యే అని ఇన్ డైరెక్టుగా మాట్లాడాడు.

జనాలను ఫూల్స్ చేయడానికేనా?
ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నమ్మించేలా చెప్పడంలో జేడీ దిట్ట. గతంలోనూ తన పెళ్లి గురించి చాలా విషయాలు చెప్పాడు. ఆ మధ్య హాలీవుడ్ డైరెక్టర్ స్పీల్ బర్డ్ ఓ సినిమాలో అవకాశం ఇచ్చాడని చెప్పాడు అది కూడా జనాలను ఫూల్స్ చేయడానికే చెప్పాడు. ఇప్పుడు స్లో పాయిజన్ కథ కూడా అంతే అయి ఉండొచ్చంటాన్నారంతా.

విష్ణుప్రియతో ఆ రిలేషన్!
యాంకర్ యాక్టర్ విష్ణుప్రియ ఓ టాక్ షోలో జేడీ చక్రవర్తిని ప్రేమిస్తున్నా తను ఒకే అంటే పెళ్లి చేసుకుంటా అంటూ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గతంలో జేడీ చక్రవర్తి ఓ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఆమెతో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఈ సమయంలో విష్ణుప్రియ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ కామెంట్స్ పై తాజాగా రియాక్టైన జేడీ విష్ణు ప్రియతో కలసి వెబ్ సిరీస్ నటించాను, ఆ షూటింగ్ సమయంలో విష్ణు ప్రియ రిలేషన్ ఏర్పడింది కానీ అది కేవలం గురుశిష్యుల బంధం మాత్రమే అన్నాడు.