బొబ్బిలి రాజులు ఎన్నికల యుద్ధంలో గెలిచారా ? పోలింగ్ సరళి తేల్చింది ఇదేనా ?

బొబ్బిలి నియోజకవర్గం.. రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. బొబ్బిలి రాజులు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం ప్రాధాన్యత సంతరించుకోడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఉమ్మడి విజయనగరంజిల్లాలో విజయనగరం నియోజకవర్గంపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అక్కడ ఎవరు గెలుస్తారనే పొలిటికల్ అటెన్షన్ సహజం. పార్టీలు ఏవైనా.. రాజవంశీయుల విజయంపైనా అందరి దృష్టి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. వారి విజయావకాశాలపై ఎప్పుడూ చర్చ సాగుతూనే ఉంటుంది.

గెలుస్తామన్న నమ్మకంతో టీడీపీ

ఉమ్మడి జిల్లాలో మొదటి గ్యారంటీ సీటు ఇదే అన్నది టీడీపీ లెక్క. ఇపుడే కాదు 2019 లోనూ ఈ సీటు తమదే అని భావించిన చంద్రబాబు లెక్క తప్పింది. మొదటిసారిగా రాజవంశీయులు పరాజయాన్ని చవిచూశారు.
ఈసారి మాత్రం.. ఆ సీన్ రిపీట్ కాదనేది తెలుగుతమ్ముళ్ల వాదన. దానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు కారణమైతే.. వ్యక్తిగతంగా బేబీనాయన కొన్నేళ్లుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు. దీంతో ఈ సీట్‌ గ్యారంటీ అనే ధీమాలో టీడీపీ అధిష్టానం ఉంది. మరోవైపు…వైసీపీ కూడా గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది.

బేబినాయనవైపు మొగ్గిన న్యూట్రల్ ఓటర్లు

బొబ్బిలిలో టీడీపీకి కాస్త ఎడ్జ్ ఉండవచ్చనేది రాజకీయవర్గాల అంచనా. పార్టీలకు అతీతంగా ఉండే న్యూట్రల్ ఓటర్లు ఎక్కువగా బేబీనాయనను కోరుకుంటున్నట్లు పోలింగ్ సరళి వెల్లడించింది. నిత్యం ప్రజల్లో ఉండడం, సేవాకార్యక్రమాలు చేయటం సహా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌ కూడా ఆయనకు కలసి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలోని ఇతర పార్టీల ఓట్లు కూడా ఆయనకు కలిసి వస్తాయనే అంచనా కూడా ఉంది. దీంతో వైసీపీ ఓటమిని ముందే అంగీకరించిందని టాక్ నడుస్తోంది.

పోలింగ్ రోజు వైసీపీ గొడవలు

రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకులను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ పైనా దాడులు జరిగాయి. ఇందులో స్వయంగా శంబంగి కుటుంబీకులే దగ్గరుండి చేయించారన్న ఆరోపణ ఉంది. ఓటమిని తట్టుకోలేకే ఇలాంటి గొడవలకు దిగారంటూ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట. వార్ వన్‌సైడ్ అని ఇరు పార్టీల నేతలూ చెబుతున్నా ఫలితం వచ్చే వరకూ ఎవర్నీ తక్కువ అంచనా వేయకూడదనేది రాజకీయ నిపుణుల మాట. జనం ఎవరికి పట్టం కట్టారో చూడాలంటే జూన్‌ 4 వరకూ ఆగాల్సిందే.