సమ్మర్ హాలిడేస్ కదా..పిల్లలంతా ఇంట్లోనే ఉంటారు. ప్రతి నిముషం తినడానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. టీవీ చూస్తూ టైంపాస్ అయ్యేందుకు నోరు ఆడిస్తూనే ఉంటారు. ఏదో ఒకటి చేసిపెట్టే టైమ్ పెద్దవాళ్లకి ఉండదు కదా..పైగా అంతా ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నవాళ్లే. అందుకే మార్కెట్లో రెడీ టు ప్రిపేర్ స్నాక్స్ తీసుకొచ్చి ఇలా వేయించి అలా వడ్డించేస్తున్నారు. ఇలాంటి స్నాక్స్ ఐటెమ్స్ లో టేస్టీ, సింపుల్, ఫాస్ట్ ఫుడ్ ఫ్రెంచ్ ప్రైస్. అయితే రుచిగా ఉన్నాయి, తొందరగా అయిపోతున్నాయని రోజూ తిన్నారంటే మాత్రం అనారోగ్యాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నట్టే అంటున్నారు ఆరోగ్యనిపుణులు.
ఫ్రెంచ్ ఫ్రైస్ తో మానసిక రుగ్మత
ఊరుకుల పరుగుల జీవితం లో ఏది ఆరోగ్యం, ఏది అనారోగ్యం అనే ఆలోచించేత ఓపిక, తీరిక ఎవరికీ లేవు. బయట మార్కెట్ లో దొరికిన ఫాస్ట్ ఫుడ్ వైపు, ఇనిస్టెంట్ ఫుడ్ కి జనాలు అలవాటు పడిపోతున్నారు. కానీ ఆరోగ్యానికి అవే పెద్ద శత్రువులు అని గుర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్..హాట్ చిప్స్ కొనుక్కుని తీసుకొచ్చి టేస్ట్ బావున్నాయ్ అనుకుంటున్నారు కానీ అవన్నీ ప్రమాద కరమైనవే. వీటిలో ఎక్కువగా తినేవి ఫ్రెంచ్ ఫ్రైస్. పిల్లలకు, పెద్దవాళ్లకి కూడా వీటిని చాలా ఇష్టపడతారు. వీటిని ఒకసారి తినటం మొదలుపెడితే ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తారు. టీవీ చూస్తూ తింటే అసలు ఆపనే ఆపరు. వాస్తవానికి ఆలూ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాంటిది డీప్ ఫ్రై చేసిన ఆలు ఇంకా హానికరం. ఇంచుమించు గా 11 ఏళ్లుగా చేసిన పరిశోధనలో నివ్వెర పోయే నిజాలు వెలుగుచూశాయి. ఇంతవరకు అందరూ జంక్ ఫుడ్ వలన కేవలం ఊబకాయం, ఫ్యాట్ మాత్రమే అనుకున్నారు కానీ మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని, అంతే కాకుండా రక్తపోటు, యాంగ్జటీ కూడా వస్తాయని పరిశోధనలు హెచ్చరించాయి.
సర్వేలో షాకింగ్ విషయాలు
సుమారు 1,40,728 మంది పై జరిపిన సర్వే లో చాలా విషయాలు ప్రాక్టికల్ గా నిరూపించారు. ఆల్ రెడీ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళని కాకుండా మిగతావారిని ఎంపిక చేసి వారికి డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని, ఫ్రెంచ్ ఫ్రైస్, ని ఇచ్చి వారి ఆరోగ్య పరిస్థితి ని అంచనా వేశారు. 12, 375 డిప్రెషన్ కు గురి కావడం గమనించారు. ముఖ్యంగా యువకుల్లో ఇది ఇంకా ఎక్కువ కనిపించింది. కారణం యువత ఆహరం విషయం లో నియంత్రణ లేకుండా ఉంటారు… మూడ్ స్వింగ్స్ కి అనుకూలంగా ఫుడ్ తీసుకుంటారు. వీటిలో ఆరోగ్య కరమైన వాటికంటే ఆనారోగ్యమైనే ఫుడ్డే ఎక్కువ ఉంటుంది. అందుకే ఒకప్పటి తో పోలిస్తే ఇప్పుడు 30 ల్లోనే మధు మేహం, గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ లు ఎక్కువ అయ్యాయి.ఆరోగ్యానికి మేలు చేసే క్యారట్, స్వీట్ ఫొటోటో, స్వీట్ కార్న్, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ లాంటివి తీసుకోవటం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు, పైబర్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, అందిచడం మే కాకుండా మానసిక ఒత్తిడి ని, అనేక శారిరక సమస్య లను దూరం చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం