బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన దారుణాలు దేశం మొత్తాన్ని నివ్వెర పోయేలా చేస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ తమ పార్టీ పట్టు అన్ని విధాలుగా కోల్పోతూండటంతో.. హింసతోనైనా పంచాయతీ ఎన్నికల్లో విజయాలు సాధించాలని పెట్టుకున్న లక్ష్యం కారణంగా పెద్ద ఎత్తున రాజకీయ హత్యలు చోటుచేసుకున్నాయి. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంంగా దాదాపుగా ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారంటే చిన్నవిషయం కాదు. ఇంత దారుణమైన నఎన్నికల నిర్వహణ ఎక్కడా ఉండదు.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినప్పటి నుండి తృణమూల్ ఘర్షణలు
గత నెల 8న పంచాయతీ ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి బెంగాల్ ఉద్రిక్తంగానే ఉంది. ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి లేదని కేంద్రం పారామిలటరీ బలగాలను కూడా పంపింది. అయినా అధికార పార్టీ నేతలు ఏ మాత్రం తగ్గలేదు. ఇష్టారీతిన హత్యాకాండకు పాల్పడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘం హింస జరుగుతుందని తెలిసి కూడా నిర్లిప్తంగా వ్యవహరించింది. చివరికి సున్నితమైన ప్రాంతాలను గుర్తించడంలో జాప్యం కారణంగా కలకత్తా హైకోర్టు కేంద్ర బలగాలను కోరాలని , మోహరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన తర్వాతే కేంద్ర బలగాలు వచ్చాయి. అయితే బలగాలను అడ్డుకునేందుకు మమతా బెనర్జీ చేయని ప్రయత్నం లేదు. సుప్రీంకోర్టుకుకూడా వెళ్లారు. అక్కడా ఊరట లభించలేదు.
ఎన్నికల ప్రక్రియ అంతా అపహాస్యం
కొన్ని పంచాయతీలకు నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్థులను అడ్డుకున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకుననాయి. తూర్పు బర్ధమాన్ జిల్లాలోని బార్సుల్లో తృణమూల్ పార్టీ నేతలు ఇతరులపై దాడి జరిగి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే ఉత్తర 24 పరగణాలు జిల్లాలో దాడులు జరగటంతో పాటు బీజేపీ పార్టీ కార్యాలయం, బయట పార్క్ చేసిన పలు మోటర్బైక్లను కూడా ధ్వంసం చేశారు. అలాగే, నాడియా జిల్లా, ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని నకాషిపరా వద్ద కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. ఇలా ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులు జరగటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఏ మాత్రం గౌరవించే పరిస్థితిలో తృణమూల్ లేదని తేలడంతో .. కేంద్ర బలగాలు వచ్చాయి. అయినా పరిస్తితి మారలేదు.
ఎన్నో నిబంధనలు పెట్టిన హైకోర్టు కానీ..
కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా ఎన్నికల సంఘం సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన జిల్లాలు, ప్రాంతాలలో కేంద్ర బలగాలను మోహరించాలని కోర్టు ఆదేశించింది. అన్ని పోలింగ్ బూత్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని వెల్లడించింది. అయితే ఏవీ కూడా హింసను నివారించలేకపోయాయి. రిగ్గింగ్.. దాడులు యథేచ్చగా జరిగిన వ్యవహారంపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే మమతా బెనర్జీ.. విచిత్రంగా.. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని విమర్శిస్తూ ఉంటారు. మమతా బెనర్జీ లాంటి వాళ్ల చేతుల్లోకి దేశం వెళ్లే బెంగాల్ లా రావణకాష్టం కావాల్సిందేనన్న ఆందోళనలు సహజంగానే వస్తాయి మరి.