ఒక్క ఆలోచన ప్రజల జీవితాలను మార్చేస్తుంది. ఒక్క కార్యచరణ ప్రజల ఆర్థిక స్థితిగతుల ను మార్చేస్తుంది. అలాంటి ఆలోచనే జన్ ధన్ ఖాతాల ప్రారంభం. జన్ ధన్ యోజన ప్రారంభించి నేటి సరిగ్గా తొమ్మిదేళ్ల పూర్తి చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 15 ఆగస్టు 2014న బ్యాంకింగ్ సేవలకు సార్వత్రిక ప్రాప్యతను అందించడానికి PMJDYని ప్రకటించారు . ఈ పథకం 28 ఆగస్టు 2014న ప్రారంభించారు. ఆగస్ట్ 16 నాటికి, మొత్తం పీఎంజేడీవై ఖాతాల సంఖ్య 50 కోట్లకు చేరింది.
50 కోట్ల మంది నిరుపేదలకు బ్యాంక్ ఖాతాలు
దేశశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో జన్‌ధన్ బ్యాంకులు 50 కోట్లకు చేరుకున్నాయి. తొమ్మిదేండ్లలోనే ఈ మార్క్ దాటింది. ఈ ఖాతాలతో లబ్ధి పొందిన వారిలో మహిళలు 56 శాతం ఉన్నారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో గల 67 శాతం జన్‌ధన్ ఖాతాల్లో రూ.2.03 లక్షల కోట్లు డిపాజిట్ చేశారు. ఖాతాదారులకు 34 కోట్ల రూపే కార్డులు ఉచితంగా జారీ చేశారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద ఒక్కో అకౌంట్‌లో సరాసరి రూ.4,076 క్యాష్ ఉంది. దాదాపు 5.5 కోట్ల అకౌంట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ప్రయోజనాలు పొందుతున్నాయి. 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. జన్‌ధన్ ఖాతాలను ప్రారంభించారు. తొలి ఏడాదిలో 17.90 కోట్ల మంది ఖాతాలు ప్రారంభించారు. ఈ ఖాతాలకు కనీస నగదు నిల్వ నిబంధన వర్తించదు. వీటిపై రూ.2 లక్షల వరకు బీమా వసతి కల్పిస్తుంది కేంద్రం. రూ.10 వేల వరకూ రూ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంది.
ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాలతో పేదలకు సాయం !
దేశంలోని ప్రతి వ్యక్తిని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఈ పథకాన్ని 28 ఆగస్టు 2014న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించారు ప్రధాని మోదీ. పీఎం జన్ ధన్ యోజన కింద మీరు ఏదైనా బ్యాంకులో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను తీసుకోవచ్చు. ఇందులో, ఖాతాదారులందరికీ ఉచిత రూపే డెబిట్ కార్డ్, రూ. 2 లక్షల వరకు బీమా రక్షణ ప్రయోజనం లభిస్తుంది. దీంతో పాటు రూ.10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా లబ్ధిదారులకు లభిస్తుంది. ఈ ఖాతాల ద్వారా, దేశంలోని కోట్లాది మందికి డీపీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా పీఎం కిసాన్ స్కీమ్, పీఎం ఫసల్ బీమా యోజన మొదలైన వివిధ పథకాల కోసం ప్రభుత్వం డబ్బును బదిలీ చేస్తుంది.
స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్ల వరకూ పేదలకు బ్యాంకింగ్ దూరం
స్వాతంత్య్రం సంవత్సరం వచ్చిన మొదటి 67 ఏళ్లలో అంటే 2014 వరకు జనాభాలో 50 శాతానికి కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో చోటు లేదు. కానీ జన్ ధన్ యోజన వచ్చిన తర్వాత కోట్లాది మంది పౌరులు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యమయ్యారు. ఇందులో 55 శాత మంది మహిళలే. అంతేకాక ఈ అకౌంట్లలో లక్షన్నర కోట్లకు పైగా డిపాజిట్ అయ్యాయి. జన్ ధన్ ఖాతాకు బీమా సౌకర్యం కూడా ఉంటోంది. అంటే ఖాతాదారులకు అనుకోని ప్రమాదం ఏమైనా జరిగితే బీమా రక్షణ పొందుతారు. అంతేకాక ప్రభుత్వ స్కీమ్‌ల ప్రయోజనాలన్ని నేరుగా ఈ అకౌంట్ల ద్వారా ప్రజల చెంతకే చేరుతున్నాయి. మధ్యవర్తిత్వం తగ్గింది. ఆర్థిక భాగస్వామ్యం కల్పించడంలో ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పథకం.