గతేడాది చివర్లో సలార్ తో వచ్చిన ప్రశాంత్ నీల్ హిట్టందుకున్నాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 730 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఇక తర్వాత ప్రాజెక్ట్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ లో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది..
శౌర్యంగపర్వం తర్వాతేనా
‘సలార్’ సీక్వెల్ శౌర్యంగ పర్వం ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది ఆగష్టు లోపు శౌర్యంగ పర్వం విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాత విజయ్ కిరంగదూర్ ప్రకటించాడు. ప్రభాస్ కూడా ఈ ఏడాదిలో ఆ సినిమాని పూర్తి చేసి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. దీంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి వెనక్కి నెట్టి సలార్ 2 పైన ఫోకస్ చేశాడని టాక్.
దేవరతో NTR బిజీ
ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్ లో ఉన్నాడు. ఇది ఏప్రిల్ 5న సమ్మర్ కానుకగా రిలీజ్ కానుందన్నారు కానీ ఇది సాధ్యమయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. మరోవైపు మార్చి నుంచి హిందీలో చేస్తోన్న వార్ 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఆ సినిమాకి 90 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ పూర్తైన తర్వాత దేవర సీక్వెల్ కూడా ఉంటుంది.
ఇద్దరి ప్రాజెక్టులు ఓ కొలిక్కి వచ్చాక
ఇద్దరూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో ప్రశాంత్ నీల్ వెళ్లి ఎన్టీఆర్ ని కలిశాడు. ఇద్దరూ తమ ప్రాజెక్టుపై చాలాసేపు చర్చించుకున్నట్టు టాక్. అంటే ఈ మూవీపై త్వరోలనే క్లారీట వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇద్దరి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తైన వెంటనే ఈ కాంబో పట్టాలెక్కనుందని టాక్. అయితే ఈ ఏడాది ఆఖర్లో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో తారక్-నీల్ మూవీ ప్రారంభం కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించనుంది. భారీ కాన్వాస్ పై డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కబోయే ఈ మూవీ కోసం ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.