పాతికేళ్ల తర్వాత మళ్లీ క్రేజీ కాంబినేషన్ – మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

బాలీవుడ్ లో’ కుచ్ కుచ్ హోతా హై’ మూవీ ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స‌ల్మాన్ ఖాన్-క‌రుణ్ జోహార్ కాంబినేష్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయింది. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ పట్టాలెక్కబోతోంది.

25 ఏళ్ల తర్వాత సల్మాన్ ఖాన్ (Salman khan), కరణ్ జోహార్(Karan Johar) ధర్మ ప్రొడక్షన్ తో కలిసి భారీ బడ్జెట్ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు విష్ణు వర్ధన్(Vishnu vardhan) తెరకెక్కించనున్నాడు. ఈ యాక్షన్ మూవీ కోసం సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, విష్ణు వర్ధన్ గత 6 నెలలుగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. షేర్‌షా తర్వాత బాలీవుడ్ లో విష్ణు వర్ధన్‌కి ఇది రెండో సినిమా. టైగర్ 3 మూవీ తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను 2024 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్.

ట్రెండ్ సెట్ చేసిన క్రేజీ కాంబినేషన్
‘ కుచ్ కుచ్ హోతా హై’ సినిమా అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. స‌ల్మాన్ ఖాన్ న‌ట‌న‌ , క‌రుణ్ మేకింగ్ సినిమాని గొప్ప స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ తర్వాత ఈ హిట్ కాంబినేష‌న్ మ‌ళ్లీ చేతులు క‌ల‌ప‌లేదు. స‌ల్మాన్ ఎంతో మందిని రిపీట్ చేసాడు గానీ మ‌ళ్లీ క‌ర‌ణ్ తో సినిమా చేయ‌లేదు. అలాగే క‌ర‌ణ్ జోహార్ కూడా ఎంతో మంది ద‌ర్శ‌క‌-హీరోలతో పనిచేసాడు కానీ భాయ్ ని టచ్ చేయలేదు. మ‌ళ్లీ 25 ఏళ్ల త‌ర్వాత ఆ కాంబో లో సినిమాకి రంగం సిద్ద‌మ‌వుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ న‌వంబ‌ర్ లో ప్రారంభం కానుంది. ఈనెల‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొత్తం పూర్తి కానున్నాయి. ఇది ఓ భారీ యాక్ష‌న్ చిత్ర‌మ‌ని ఇందులో కొత్త భాయ్ ని చూస్తారంటున్నారు మేకర్స్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మనీష్ శర్మ దర్శకత్వంలో నటించిన టైగర్ 3(tiger 3) మూవీ ఈ దీపావళికి విడుదలకు సిద్ధంగా ఉంది.

విష్ణు సక్సెస్ కొనసాగిస్తాడా!

విష్ణు సక్సెస్ కొనసాగిస్తాడా!
‘షేర్ షా’ సినిమాతో విష్ణు వ‌ర్ద‌న్ కి మంచి పేరొచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ని సాధించింది. విష్ణు వ‌ర్ద‌న్ తెలుగులో ‘పంజా’ మూవీ తీశాడు కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు. అంతకుముందు కోలీవుడ్ లో కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడు. ‘షేర్ షా’ లో బీటౌన్లో అడుగుపెట్టడం హిట్టుకొట్టడం జరిగిపోవడంతో మంచి అవకాశాలే వస్తున్నాయి. సల్మాన్ తో మూవీ కూడా సక్సెస్ అయితే బాలీవుడ్ లో విష్ణువర్థన్ పేరు మారుమోగిపోవడం ఖాయం.