ప్రసవం అనంతరం పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ సహజంగా ఏర్పడతాయి. పొట్టని అందవిహీనంగా మారుస్తాయి. అయితే వీటిని వదిలించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్స్ వాడుతుంటారు. కానీ అంతవరకూ వెళ్లాల్సిన అవసరం లేదు మీ కిచెన్లోనే ఉంది అద్భుతమైన చిట్కా అంటారు ఆరోగ్య నిపుణులు..
వంటల్లో పసుపును విరివిగా వాడుతుంటారు. అసలు పసుపు లేని వంటగది ఉండదు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వంట్లలో పసుపును వాడడం వల్ల వంటలకు చక్కటి రంగు రావడంతో పాటు మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానకి కూడూ పసుపు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
చర్మ సమస్యలకు చెక్
చాలా మంది మొటిముల, మచ్చలు, చర్మం ముడతలు పడడం, చర్మంపై స్ట్రెచ్ మార్క్స్, జిడ్డు వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతుంటారు. వీటని తగ్గించడంలో పసుపు సహాయపడుతుంది. పసుపును వాడడం వల్ల చర్మ సమస్యలు తగ్గడంతో పాటు స్కిన్ అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.
పసుపు ఎలా వినియోగించుకోవాలి
@ పసుపులో నిమ్మరసాన్ని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు తగ్గుతాయి.
@ పసుపులో ఆలివ్ నూనెను కలిపి గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.
@ ముడతల సమస్యతో బాధపడే వారు పసుపులో టమాట రసం, పాలు, బియ్యంపిండి కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను చర్మంపై రాసి ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది. చర్మంపై ఉండే జిడ్డు కూడా తొలగిపోతుంది.
@ స్ట్రెచ్ మార్క్స్ సమస్యతో బాధపడే వారు పసుపులో శనగపిండి, పాలు కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత దీనిని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ సమస్య తగ్గుతుంది.
@ చిటికెడు కుంకుమ పువ్వు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ బౌల్ ను మరుగుతున్న నీటిలో రెండు నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.ఇలా హీట్ చేసిన మిశ్రమాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత పొట్ట పై అప్లై చేసి సున్నితంగా వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, కుంకుమపువ్వు, పసుపులో ఉండే పలు సుగుణాలు స్ట్రెచ్ మార్క్స్ ను ఈజీగా తొలగించేస్తాయి.
@ కొబ్బరి నూనెను స్ట్రెచ్ మర్క్స్ పై వేసి మర్దన చేయాలి. ఇలా రోజు చేస్తే స్ట్రెచ్ మర్క్స్ తగ్గుతాయి. కొబ్బరి నూనె కు చర్మ సమస్యలను నయం చేసే శక్తీ ఉందని అనేక అధ్యయనాలు నిరూపించాయి.
@ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో అలోవెరా కన్నా గొప్పది లేదు అనడంలో అతిశయోక్తి కాదు. చాలా వరకు సౌందర్య ఉత్పత్తుల్లో దీనిని ఉపయోగిస్తారు.అలోవెరా చర్మం ఆరోగ్యానికి ఏంతో మంచిది. వీటి లోని సహజ గుణాలు స్ట్రెచ్ మార్క్స్ ని కూడా పూర్తిగా నిర్మూలించగలవు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.