దేశ ప్రజలు తమ ఆదాయాల నుంచి ఎంతో కొంత మిగుల్చుకోవాలంటే ద్రవ్యోల్బణం కట్టడి చేయడం చాలా మఖ్యం. గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రజలు ధరల పెరుగుదలతో ఎన్ని బాధలు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలతో ద్రవ్యోల్బణం కట్టడి అయింది. విపక్షాలు ధరలు పెరిగిపోయాయనని నిందలు వేయవచ్చు కానీ.. రికార్డులు..గణాంకాలు మాత్రం అబద్దాలు చెప్పవు. కాలంతో పాటు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలు పడిన ఇబ్బందులు కూడా ప్రజలు మర్చిపోతారనుకుంటే అపోహే.
యూపీలో హయాంలో సగటు ద్రవ్యోలబణం 8.7% – ప్రస్తుతం 4.8% మాత్రమే
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ల సగటు ద్రవ్యోలబణం 8.7% గా నమోదియంది. కానీ ఇప్పుడు ఎన్డీఏ హయాంలో అది 4.8% మాత్రమే ఉంది. ఓ దశలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో, ద్రవ్యోల్బణం 2010లో దాదాపుగా 12 శాతానికి చేరుకుంది. 2014లో మోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన బిజెపి పాలనలో ద్రవ్యోల్బణం దశాబ్దం కిందటి కంటే తక్కువగా ఉంది.
2017లో, సగటు వార్షిక రేటు 3% కంటే తక్కువ. ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాల వల్ల కాస్త పెరిగింది. వస్తు, సేవల ధరల్లో పెరుగుదల రేటు అయిన ద్రవ్యోల్బణం, గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో తక్కువగా ఉంది. ఇది గణాంకాలు చెబుతున్న నిజం.
ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రం కఠిన చర్యలు
భారతదేశం తన చమురు అవసరాల్లో 80% దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి, అంతర్జాతీయ ధరల్లో ఉండే హెచ్చు తగ్గులు సహజంగానే ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, 2011లో భారతదేశ క్రూడ్ ఆయిల్ దిగుమతుల ఖర్చు బ్యారెల్‌కు దాదాపు 120 డాలర్లు. దీన్ని తగ్గించుకునేందుకు కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకుంది. మోదీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న ఇతర అంశాలు కూడా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపాయి. గ్రామీణ ప్రాంతాల్లో భారీ స్థాయిలో అమలు చేస్తున్న ఆదాయ హామీ పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని బాగా పెంచింది. రైతుల పంటలకు ప్రభుత్వం హామీ ఇచ్చే ధరల్లో పెరుగుదల ఉంది. అందుకే ద్రవ్యోల్బణం కట్టడి అయింది.
ఆర్బీఐ ద్వారా కఠినమైన నిర్ణయాలు
ధరల పెరుగుదల సామాన్యులను ఇబ్బంది పెడుతుంది.అందు కోసం కొన్ని కఠిన నిర్ణయాలను ఆర్బీఐ తీసుకుంది. డిమాండును అదుపులో ఉంచేందుకు మరియు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు సహాయపడిన ఇతర పాలసీ నిర్ణయాలు కూడా కీలకమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ సత్వరం వడ్డీ రేట్లను తగ్గించే స్థితిలో లేదు, వడ్డీ రేట్లు తగ్గితే వినియోగదారులు అప్పు తీసుకోవడానికి, ఎక్కువ ఖర్చుపెట్టడానికి వీలు కలుగుతుంది. తన ఆర్థిక లోటును నియంత్రణలో ఉంచాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక లోటు అంటే ప్రభుత్వ ఆదాయవ్యయాల మధ్య ఉండే వ్యత్యాసం.తక్కువ ఆర్థిక లోటు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అప్పులు తక్కువగా ఉంటాయి. కానీ కాంగ్రెస్ హయాంలో వీటిని పట్టించుకోలేదు.