లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదన్న అంచనాలు ఉన్నాయి. దీనికి బీజం పడింది బీజేపీ అగ్రనేతల్లో ఒకరయిన బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలన్న కేసీఆర్ దుస్సాహస నిర్ణయమే కారణమన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనను అరెస్టు చేసేందుకు ప్రత్యేక విమానంలో పోలీసుల్ని పంపిన విషయం వెలుగులోకి రావడంతో … ఆయనను టార్గెట్ చేయడం వల్లే బీజేపీ ఇదంతా చేసిందన్న అభిప్రాయానికి వస్తున్నారు.
బీఎల్ సంతోష్ జోలికెళ్తే ఊరుకుంటారా ?
ఢిల్లీ బీజేపీలో మోదీ, అమిత్ షా, అధ్యక్షుడు నడ్డా తర్వాత బీఎల్ సంతోషే వపర్ ఫుల్. ఆయన బీజేపీ కీలక ినిర్ణయాల్లో భాగస్వామి, బీజేపీ ఇలా విస్తరించడానికి ఆయన నిర్ణయాలే కారణం. తెలంగాణలో బీజేపీ విజయానికి ఆయన చేస్తున్న కృషిని చూసి.. ఆయనను కుట్ర పూరితంగా అరెస్టు చేయాలని కేసీఆర్ భావించారు. తన కుమార్తె చేసిన స్కాం నుంచి ఆమెను తప్పించేందుకు చేసిన కుట్రగా బీజేపీ నమ్ముతోంది. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు కూడా ఇదే చెబుతున్నారు.
బీజేపీపైనే కుట్రలు చేస్తే ఊరుకుంటారా ?
తమ జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కేసీఆర్ కు ప్రత్యక్షంగా అందరూ చూపిస్తున్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ అసలు వేడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీఎల్ సంతోష్ జోలికి వెళ్లాలనుకోవడమే… అహంకార పూరిత నిర్ణయమని అదే కేసీఆర్ పతనాన్ని శాసిస్తోదని బీజేపీ నేతలు నేరుగానే చెబుతున్నారు., తనను టార్గెట్ చేశారని తెలిసిన తరవాత హైదరాబాద్ వచ్చిన బీఎల్ సంతోష్… ఖచ్చితంగా అనుభవించాల్సిందేనని కేసీఆర్ ను హెచ్చరించారు. దానికి తగ్గట్లే ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నారని బీజేపీ వర్గాలంటున్నాయి.
ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉంటుందా ?
ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ తన కూతుర్ని జైలుకు వెళ్లకుండా కాపాడలేకపోయారు. కవితకు ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియని పరిస్థితి. కేసీఆర్ కుమార్తెపై లిక్కర్ స్కాం ఆరోపణలు రావడం.. ఢిల్లీ జైలులో ఉండటాన్ని బీఆర్ఎస్ నేతలు సమర్థించుకోలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో గొప్పగా ఫలితాలు సాధించే అవకాశాలు కనిపించడం లేదు. ఫలితాల తర్వతా బీఆర్ఎస్ ఉండదన్న అంచనాలు ఉన్నాయి.
న