బజరంగ్ దళ్ పై కాంగ్రెస్ కొత్త నాటకం..

కర్ణాటక ఎన్నికల పోలింగ్ మరో ఎనిమిది రోజులు మాత్రమే ఉంది. ప్రధాని ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు విజయావకాశాలను మెరుగు పరుచుకునేందుకు కొత్త అస్త్రాలను బయటకు తీస్తున్నాయి. ప్రత్యర్థి కంటే తాము పైచేయిగా ఉన్నామని నిరూపించేందుకు ప్రయత్నిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి.

ఓటర్లపై హామీల జడివాన

ఉచిత హామీలతో ఎన్నికల్లో గట్టెక్కుదామనుకునే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా అదే పనిచేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే ఐదు హామీలిచ్చిన హస్తం పార్టీ అందుకు మరికొన్ని జోడించింది. అందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్,పేదలకు పది కిలోల బియ్యిం, మహిళా కుటుంబ పెద్దకు నెలకు 2,000, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు నిరుద్యోగ భృతి లాంటివి అందిస్తామన్న హామీలతో పాటు వేర్వేరు వర్గాలకు ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా మేనిఫెస్టోలో చేర్చింది. పాడి రైతలకు పాల సబ్సిడీని రూ. 7కు పెంచింది. జాలర్లకు లీన్ పీరియడ్ అలవెన్స్ తో పాటు, చేపల వేటకు వెళ్లేవారికి ఉచిత డీజిల్ ప్రకటించింది.

హిందూ సంస్థలో టార్గెట్

అధికారానికి వస్తే హిందూ సంస్థలను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుందని ముందు నుంచే అనుమానించారు. మేనిఫెస్టోలో కూడా అదే జరిగింది. మెజార్టీ, మైనార్టీ వర్గాల మధ్య కొన్ని సంస్థల విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపిస్తూ వారిపై కఠిన చర్యలకు దిగుతామని హెచ్చరించింది. అవసరమైతే బజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని కూడా ప్రకటించింది.

పీఎఫ్ఐపై ప్రేమ.. బజరంగ్ దళ్ పై అక్కసు

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ఒక ఉగ్రవాద సంస్థ. పీఎఫ్ఐ కార్యాలయాలపై దాడుల సందర్భంగా బయట పడిన ఆయుధాలు, ఉగ్రవాద సాహిత్యం, వారి కాంటాక్ట్స్ ను బట్టే ఆ సంగతి తెలుస్తోంది. సరిహద్దుకు అవతలి నుంచి వారికి అందుతున్న ఆర్థిక వనరులతో పీఎఫ్ఐ చేస్తున్న అరాచకాలు కూడా తేటతెల్లమయ్యాయి. అందుకే 2022లో పీఎఫ్ఐపై కేంద్రం ఐదేళ్ల నిషేధం విధించింది. అది సహేతుకమైన నిర్ణయమని భారతీయులంతా అమోదించారు. అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం పిడివాదంతో పీఎఫ్ఐను, బజరంగ్ దళ్ ను ఓకే గాటిన కట్టేయ్యాలని చూస్తోంది. నిత్యం ప్రజాసేవలో తరించే విశ్వహిందూ పరిషత్ యూత్ వింగ్ గా అవతరించిన బజరంగ్ దళ్ ను దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. ధర్మరక్షణకు పూనుకోవడంతో పాటు ప్రకృతి వైపరిత్యాల సమయంలో జనానికి సేవ చేయడం బజరంగ్ దళ్ విధిగా భావిస్తుంది. హనుమంతుడి తరహాలో రాముడి సేవలో తరించే బజరంగ్ దళ్ రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటోంది. వెనుకబడిన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తుంది. సామాజిక రుగ్మతలైన అంటరానితనం, వరకట్నం, హిందువులపై దాడులను అరికట్టేందుకు బజరంగ్ దళ్ కంకణం కట్టుకుంది.

మత విద్యేషాలతోనే రాజకీయ లబ్ధి పొందాలనుకునే కాంగ్రెస్ పార్టీ మాత్రం బజరంగ్ దళ్ పై విషంకక్కడం ద్వారా కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటోంది. బజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని చెబితే… ముస్లింల ఓట్లు ఏకమొత్తంగా తమకే పడతాయని కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోంది. అది పేరాశే అవుతోంది. ఎందుకంటే ప్రజల కోసం ప్రజల కోసం పురోగామి దిశలో పనిచేసే బీజేపీ వైపు ముస్లింలు మొగ్గు చూపి చాలా రోజులైంది..