హిందీ బెల్ట్‌లో కాంగ్రెస్‌ను నమ్మరు – రాహుల్‌కి ఢిల్లీ ఇంకా చాలా దూరమే !

ఐదు  రాష్ట్రాల ఎన్నికల్లో  కాంగ్రెస్ వెనుకబడింది. ఒక్క రాష్ట్రంతోనే సరి పెట్టుకుంది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అనూహ్య విజయం సాధించింది.   తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లలో కాంగ్రెస్ కు కనిపించినట్లుగా… . హిందీ రాష్ట్రాల్లో కనిపించలేదు.  ఆలాంటి నాయకత్వాన్ని అటు రాహుల్ కానీ ఇటు ఆయా రాష్ట్రాల నేతలు కానీ ప్రజలకు చూపించలేకపోయారు. రాహుల్ గాంధీ జోడో యాత్రల్ని ప్రజలు నమ్మలేదు. కులగణన పేరుతో కుల రాజకీయాన్నీ సహించలేదు.

I.N.D.I.A కూటమి ఇక చిందర వందర

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ని ఢీకొట్టేందుకు దాదాపు 24 విపక్ష పార్టీలు కలిసి I.N.D.I.A కూటమి ఏర్పాటు చేశాయి. వీటిలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మరింత డీలా పడినట్లయింది.   తాజా ఫలితాలతో బీజేపీకి హిందీబెల్ట్ లో తన పట్టు తగ్గలేదని బ ీజేపీ నిరూపించుకుంది.  గత రెండు సార్లు  హిందీబెల్ట్ లో 90 శాతానికిపైగా ఫలితాలు సాధించారు.   కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలు…  బీసీ జనగణనలు అన్నీ తేలిపోతున్నాయి.   2024 లోక్‌సభ ఎన్నికల   ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల ఈ ఫలితాలు కాంగ్రెస్ కు షాక్ ఇచ్చాయి.  సెమీస్ లో ఓడిపోయారు.  అంటే.. మరోసారి ఢిల్లీలో అధికారానికి దూరం కావాల్సిందే

కాంగ్రెస్ మరింత తగ్గింది !

తాజా ఫలితాలతో హిందీబెల్ట్ లో కూడా కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఉందని అర్థమవుతోంది. గత రెండు సార్లు హిందీబెల్ట్ లో 90 శాతానికిపైగా ఫలితాలను బీజేపీ నేతలు సాధించారు. మళ్లీ ఎన్నికలు జరిగితే అంత కంటే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, తెలంగాణతో పాటు కర్ణాటక సహా గతంలో బీజేపీ సాధించిన సీట్లు మరింత పెరగనున్నాయి. యూపీలోనూ పరిస్థితి మారుతోంది. అక్కడ కాంగ్రెస్ అసలు రేసులో లేదు. ఎస్పీ బీఎస్పీ బలహీనం అవుతున్నాయి. ఎలా చూసినా ఈ సారి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.

మోదీ సర్కార్ పై పాజిటివ్ రెస్పాన్స్

పదేళ్ల మోదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించడం లేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం తర్వాత 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కిందట బీజేపీ వేవ్‌తో ఒక్కసారిగా నీరసపడిపోయింది. వరుసగా అన్ని చోట్లా అధికారం కోల్పోతూ వచ్చింది. నిన్నటి వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటక మాత్రమే. ఇప్పుడు చత్తీస్ ఘడ్ , రాజస్థాన్ పోయాయి. తెలంగాణ మాత్ర ంకలిసింది. మిగతా అన్ని చోట్లా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీ హవానే కొనసాగుతోంది. . ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎక్కడ పోటీ చేసినా చావోరేవో అని పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ముందు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.

పరిస్థితి ఇలా ఉంటే.. రాహుల్ గాంధీ ఢిల్లీలో తనదైన ముద్ర వేయాలనుకునే అవకాశాలు దాదాపుగా హరించుకుపోయినట్లే. కాంగ్రెస్ షెడ్డుకెళ్లినట్లే.