తెలంగాణలో ఒక్క సీటు ఇస్తే అదే పదివేలు అనుకుని కాంగ్రెస్ కు మద్దతు పలికిన సీపీఐ.. ఇప్పుడు ఏపీలోనూ అదే వ్యూహం పాటిస్తోంది. సీపీఐ నారాయణకు.. అసెంబ్లీకో.. పార్లమెంట్ కో పోవాలన్న ఆశ పుట్టిందేమో కానీ… అదే పనిగా.. టీడీపీ, జనసేన మధ్యలో దూరిపోదామని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందు కోసం ఆయనను బీజేపీని ఉపయోగించుకోవడమే వారి దివాలా కోరు రాజకీయానికి నిదర్శనంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సీపీఐ నారాయణ పొలిటికల్ జిమ్మిక్కులు
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్నా.. సీఎం జగన్ పై గెలవాలన్నా.. తన దగ్గర కీలక సూత్రం ఉందని అంటున్నారు కామ్రెడ్ కురు వృద్ధుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఉరఫ్ చికెన్ నారాయణ. ప్రస్తుతం ఉన్న పార్టీలు ఏకాకులుగా ఉన్నాయని చెబుతున్న ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే.. అన్ని పార్టీలూ చేతులు కలిపి.. రోడ్డెక్కాలని సలహాలు ఇస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి. దీనిపైనే కొన్ని గుసగుసలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇక, మిగిలిన పార్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని అంటున్నారు. మిగిలిన పార్టీలు అంటే.. కామ్రేడ్లే.
అసలు ఒక్క శాతం అయినా ఓటు బ్యాంక్ లేని వామపక్షాలు
ఏపీలో వామపక్షాలకు ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ ఉందని ఎవరూ అనుకోవడం లేదు. అసలులేదు కూడా. తెలంగాణలో ఉన్న ఓటు బ్యాంక్ ను ఒక్క సీటు కోసం తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఏపీపై దృష్టి పెట్టారు. జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్ళాలి అన్నది మా ఉద్దేమని అదేసమయంలో టీడీపీని కూడా ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. మొత్తానికి బీజేపీ, వైసీపీ యేతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్న విషయాన్ని అటు ఇటు తిప్పి చాలా చక్కగా వివరించారు . కానీ లగేజీ మోసుకుని పోవడం ఎందుకని టీడీపీ, జనసేన సైలెంట్ గా ఉన్నాయి.
బీజేపీపై నిందలేసి నారాయణ రాజకీయం
మోడీని వ్యతిరేకిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు సృష్టిస్తారో అని భయపడుతున్నారని నారాయణ అంటున్నారు. మోడీని వ్యతిరేకించడం కాదని..అవినీతి పరులు భయపడుతున్నారని నారాయణపై సెటైర్లు వినిపిస్తున్నాయి. నారాయణ ఒక్కటి.. రెండు సీట్ల కోసం తాపత్రయ పడుతున్నారని.. తమ పార్టీ సిద్దాంతాలను కూడా ఎప్పుడో మర్చిపోయారని విర్శలు వినిపిస్తున్నాయి. బూజుపట్టిన సిద్ధాంతాలతో బూర్జువా రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తూ ప్రజల్లో విలువ కోల్పోయారు.