శ్రీవారి దర్శన టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముకుంటూ దొరికిన కమ్యూనిస్టు ఎమ్మెల్సీ – రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ !

కమ్యూనిస్టు పార్టీల నాయకులు దేవుళ్లను నమ్మరు. కానీ అమ్ముకుంటాని మాత్రం సిద్ధంగా ఉంటామని నిరూపించారు. కమ్యూనిస్టు పార్టీ విభాగమైన యూటీఎప్ తర్వాత ఏలూరు టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచిన షేక్ షాబ్జీని తిరుమల విజినెల్స్ పోలీసులు అదుపులోకితీసుకున్నారు. ఆయన కమ్యూనిస్టు అయి ఉండి.. నెలకు నాలుగైదుసార్లు దర్శనానికి రావడమే కాకుండా తనతో పాటు ప్రతీ సారి పదిహేను, ఇరవై మందిని తెస్తున్నారు. ఏంటా లోగుట్టు అని ఆరా తీస్తే.. తన సిఫార్సు లేఖలపై ప్రోటోకాల్ దర్శన టిక్కెట్లు తీసుకుని ఒక్కొక్కటి పదిహేను వందలకు అమ్ముకుంటున్నారు.

ప్రోటోకాల్ బ్రేక్ దర్శన టిక్కెట్లు అమ్ముకుంటున్న ఎమ్మెల్స సాబ్జీ

తిరుమలలో వీఐపీల బ్రేక్ దర్శనానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. శ్రీనివాసుడిని అతి దగ్గరగా చూడాలన్న ఆశతో ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి సిపార్సు లేఖలపై కొందరు విఐపి బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు. సాధారణంగా విఐపి బ్రేక్ దర్శన టిక్కెట్ ధర రూ. 500 మాత్రమే. అయితే ఎమ్మెల్సీ సాబ్జీ మాత్రం ఈ ఐదు వందల టిక్కెట్లను తీసుకుని పదివేలకు అమ్ముకుంటున్నారు. గత కొంత కాలంగా సిపార్సు లేఖలు అధికంగా ఇస్తున్నట్లు గుర్తించారు టీటీడీ ఈవో కార్యాలయ సిబ్బంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఎమ్మెల్సీ షేక్ షాభ్జీ లేఖలపై నిఘా ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అదో వ్యాపారంలా మార్చుకున్నషేక్ సాబ్జీ

వరుసగా తిరుమలకు రావడం, ప్రోటోకాల్ దర్శనం కావాలని టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకుని రావడంతో ఎమ్మెల్సీపై అనుమానం మొదలైంది.. గురువారం నాడు తిరుమలకు వచ్చిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తనతో వచ్చిన 14 మందికి విఐపి ప్రోటోకల్ బ్రేక్ ఇవ్వాలని ఈవో కార్యాలయానికి అభ్యర్థన పంపారు.. అయితే ఇందులో ఎమ్మెల్సీతో పాటుగా మరో పది మందికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఇవ్వగా మిగిలిన వారికి సాదారణ బ్రేక్ దర్శనం ఇచ్చారు. ఎమ్మెల్సీ వ్యవహార శైలిపై నిఘా ఉంచిన టీటీడీ విజిలెన్స్ ఎమ్మెల్సీతో వచ్చిన వారి ఐడి ప్రూఫ్ వెరిఫికేషన్ చేశారు. దింతో టీచర్స్ ఎమ్మెల్సీ టిక్కెట్ల దందా బట్టబయలు అయింది. వచ్చిన 10 మందిలో ఆరుగురు వ్యక్తులు ఫోర్జరీ ఆధార్ కార్డులతో దర్శనానికి తీసుకువెళ్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారుల తనిఖీల్లో తేలింది. నకిలీ ఆధార్ లో చిరునామా హైదరాబాద్ ఉంటే, వారి‌ ఒరిజినల్ ఆధార్ లో మాత్రం కర్ణాటక రాష్ట్రం వివరాలు ఉండడంను గుర్తించారు..

సాబ్జీ డ్రైవర్ ఖాతాలో లక్షలు

6 మంది దర్శనం కోసం లక్షా 5 వేల రూపాయలను ఎమ్మేల్సి డ్రైవర్ ఖాతాకు భక్తులు నగదు బదిలీ చేసినట్లు గుర్తించామని విజిలెన్స్ అధికారులు ప్రకటించారు. నెల రోజులు వ్యవధిలో ఎమ్మెల్సీ షేక్ షాబ్జి 19 సిఫార్సు లేఖలు జారి చేశారని వెల్లడించారు.ప్రతి సిఫార్సు లేఖను ఎమ్మెల్సీ ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులుకే ఇచ్చినట్లు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారి తిరుమల వన్ టౌన్ పోలీసులకు కేసు అప్పగించారు.

రాజీనామా చేయాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్

ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కమ్యూనిస్టు నేతలు తమను తాము చేగువేరాలుగా ఊహించుకుని ..దోపిడీలు చేస్తున్నారని మండిపడ్డారు. నైతిక బాధ్యత తీసుకుని సాబ్జీ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.