CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh Cm jagan Mohan Reddy) మరోసారి విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు భరోసారి విడుదల సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీరును తప్పు పట్టారు.. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ యుద్ధం జరుగుతోంది అన్నారు. ఆ యుద్ధంలో ప్రజల సహకారం మంచి చేస్తున్న తనకు ఉండాలని కోరారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బడ్జెట్ కానీ.. ఎందుకు ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు అందించలేదని ప్రశ్నించారు. ఎందుకు అప్పుడు చంద్రబాబు బటన్ నొక్కి రైతుల అకౌంట్లు డబ్బులు వేయలేదని ప్రశ్నించారు.
ప్రతిపక్షాల కుట్రలను తిప్పిికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు వస్తుండడంతో మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారని.. ప్రజలు ఎవరూ ఆ మాటలు విని మోసపోవద్దన్నారు. నిజంగా చంద్రబాబు , పవన్ లకు దమ్ము, ధైర్యం ఉంటే 175 నియోజక వర్గాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు..
తన పట్ల ప్రేమ అభిమానులు చూపిస్తున్న రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇవాళ్ల రైతులకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు చేస్తున్నామని.. 50 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వరుసగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నాం అన్నారు. అలాగే తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా ఏటా 13,500 భరోసా అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 50.92 లక్షల మందికి రూ.5,853.74 కోట్లు లబ్ధిచేకూరింది. మూడో విడత కింద 51.12 లక్షల మందికి రూ. 1.090.76 కోట్లు జమ చేస్తున్నామని గుర్తు చేశారు.
తమ ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి 54 వేల రూపాయల చొప్పున సాయం చేసిందన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో రైతు భరోసా కింద 27,062 కోట్ల రూపాయల సాయం అందజేశామన్నారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నామని గుర్తు చేశారు. మాండూస్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన 91,237 మంది రైతులకు 76,99 కోట్లు అందిస్తున్నామన్నారు.
2014-19 మధ్య గత ప్రభుత్వంలో ఓ అన్యాయస్థుడు సీఎంగా ఉన్నారని.. ఆ చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే తాండించింది అన్నారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబని.. మాజీ సీఎం హయంలో ఏటా కరువు మండలాల ప్రకటనే ఉండేదన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉందన్నారు. కడుపు మంటకు, అసూయకు అసలే మందు లేదంటూ చంద్రబాబుకు హితవు పలికారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చంద్రబాబు తన మద్దతు దారులు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. మీ బిడ్డ పాలనకు.. చంద్రబాబు పాలనకు వ్యత్యాసాన్ని గమనించాలని జగన్ కోరారు. మంచి చేశాం, మంచి జరిగిందని అనిపిస్తే తోడుగా ఉండండి అని కోరారు. మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో చూసుకోండి. ఇచ్చిన హామీలు అన్ని నెరవేస్తున్నాం. చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్ విసురుతున్నా.. అని 175కి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అని సవాల్ చేశారు.