చీటికి మాటికీ కోపం వచ్చేస్తోందా.. అయితే ఇవి పాటించి చూడండి!

కొంతమందికి ఊరికే కోపం వచ్చేస్తుంది. నార్మల్ గా స్పందించాల్సిన విషయాలకు కూడా ఫ్రస్టేట్ అవుతారు. పైగా కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోతారు..ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. కాసేపాగి కూల్ అయిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పనిలో పడతారు. కానీ..అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎప్పుడో ఓసారి ఇలా ఉన్నారంటే సరే అనుకోవచ్చు..తరచూ మీ ప్రవర్తన ఇలాగే ఉంటే మీరు బంధాలకు దూరమైపోవాల్సి వస్తుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు

బ్రీథింగ్ ఎక్సరసైజ్
కోపాన్ని కంట్రోల్ చేయడానికి బ్రీథింగ్ వర్కౌట్స్ హెల్ప్ చేస్తాయంటున్నారు నిపుణులు. మనస్సుని శాంతపరచడానికి సులభమైన మార్గం నెమ్మదిగా, డీప్ బ్రీథింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. కొద్దిసేపు వర్కౌట్స్, వాకింగ్ కూడా చికాకు నుంచి మిమ్మల్ని దూరంగా తీసుకెళతాయి.

ఒత్తిడి అవాయిడ్ చేయండి
ఒత్తిడిగా ఉన్నప్పుడు చాలా మందికి నెగెటివ్ థాట్స్ వస్తుంటాయి. ఆలోచనల ప్రవాహం పెరుగుతుంది. ఆ ప్రభావం మాటలపై పడుతుంది. అందుకే ఒత్తిడి తగ్గించుకోవాలి. వాటిని వీలైనంతగా అవాయిడ్ చేయాలి. దీని వల్ల కోపం తగ్గుతుంది.

సంగీతం వినాలి
మీ మనసుకి సంతోషాన్ని కలిగించే సంగీతాన్ని వినడం మంచిది. దీని వల్ల చాలా రిలాక్స్‌గా ఉంటుంది. కాబట్టి, కోపంగా ఉన్నా, మనసు బాలేకున్నా చక్కని సంగీతం వినండి.

పచ్చని ప్రదేశంలో కూర్చోండి
చుట్టూ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటే మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మీ మనసు గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రభావం వేరేవారిపై పడకుండా ఉండాలంటే పచ్చని ప్రకృతి మధ్య సమయం స్పెండ్ చేయాలి. ప్రకృతి మధ్యలో ఉంటే ఒత్తిడి మాయమవుతుంది, కోపం తగ్గుతుంది.

మంచి స్నేహితులు
చుట్టూ ఎంత మంది ఉన్నా…బెస్ట్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఉండే ఆనందం వేరు. కష్టంలో, చికాకులో ఉన్నప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ తో టైమ్ స్పెండ్ చేయండి. మీ మనసులో ఉన్న సమస్యను, ఆలోచనను పంచుకోండి. దీనివల్ల మీకు మనశ్శాంతి లభించవచ్చు.

హాయిగా నిద్రపొండి
నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి చికాకుగా ఉన్నప్పుడు కాసేపు కునుకుతీయండి. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.